
మహిళలతో అశ్లీల నృత్యాలు
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో రికార్డింగ్ డ్యాన్సుల మోత మోగింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సైదప్ప కాలనీలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో నిర్వాహకులు ఈ రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు. మొదట ఆర్కెస్ట్రాతో మొదలు పెట్టి...ఆ తర్వాత అసభ్యకర నృత్యాలకు తెర తీశారు. పెద్ద సౌండ్‌సిస్టమ్‌ల మధ్య బహిరంగంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది.