సీజ్ చేసిన వ్యాన్, ఇతర సరంజామాతో ఎస్‌ఐ గోపీ నరేంద్రప్రసాద్, హెచ్‌సీ ప్రసాద్
రాజవొమ్మంగి: టీడీపీ నాయకుడు లోకేశ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో అశ్లీల నృత్యాలతో చిందులెయ్యడం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి పూట అశ్లీల నృత్యాలతో తమ గ్రామ వాతావరణాన్ని కలుషితం చేశారంటూ రాజవొమ్మంగి మండలం అనంతగిరి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (23వ తేదీ) మండలంలోని అనంతగిరిలో టీడీపీకి చెందిన కొందరు యువకులు తమ నాయకుడి బర్త్‌డే పేరుతో బయట ప్రాంతం నుంచి మహిళలను గ్రామానికి రప్పించారు. వారితో అశ్లీల నృత్యాలు చేయించారు.
ఊరి చివర అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో ఈ నృత్యాల సమాచారం పోలీసులకు తెలిసింది. దీనితో సీఐ రవికుమార్ ఆదేశాల మేరకు రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు గోపీ నరేంద్రప్రసాద్, షరీఫ్ వెళ్లి ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో కారు, బొలేరో వ్యాన్, 8 మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జనరేటర్, లైటింగ్ సామగ్రి, టెంట్ సామగ్రి సీజ్ చేశామని ఎస్‌ఐలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment