సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని టాట్ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో ఆదివారం ఈ దాడి నిర‍్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో 25 మంది యువతీ యువకులు పట్టుబడినట్లు సమాచారం. కాగా, పబ్‌లో పట్టుబడ్డ యువతులు హల్ చల్ చేశారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. సెల్‌ఫోన్స్‌ను నేలకేసికొట్టారు. యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రైవేట్ బస్సులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment