అడ్డూఅదుపు లేకుండా అశ్లీల నృత్యాలు | Sankranthi Celebrations : Obscene dances Malkipuram | Sakshi
Sakshi News home page

అడ్డూఅదుపు లేకుండా అశ్లీల నృత్యాలు

Published Mon, Jan 15 2018 10:29 AM | Last Updated on Mon, Jan 15 2018 10:39 AM

Sankranthi Celebrations : Obscene dances Malkipuram - Sakshi

తూర్పుగోదావరి జిల్లా(మల్కిపురం) : సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడింపందేల జోరు.. బెట్టింగ్‌ల హోరు. ఇంకోవైపు రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించడం షరామామూలుగా జరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది.

అందుకే పోలీసులు కూడా జోక్యం చేసుకోవాలంటే జంకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలంలోని శంకరగుప్తం, తూర్పుపాలెం, మగటపల్లి, కేశనపల్లి, సఖినేటిపల్లి, కరవాక గ్రామాలలో అడ్డుఅదుపు లేకుండా అర్థరాత్రి యధేచ్చగా అశ్లీల నృత్యాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement