జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పబ్‌ను బుక్ చేసుకుంది ఓ ఫార్మా కంపెనీగా పోలీసులు గుర్తించారు. సేల్స్‌ను పెంచుకునేందుకే ఆ పార్మా కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌లోని సీక్రెట్ ఎఫైర్ పబ్‌లో కొంతమంది యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు టాప్ పబ్‌పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.