
గుర్తుతెలియని బాలుడు
ద్వారకాతిరుమల: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఆర్టీసీ బస్సు ఎక్కి ఆదివారం సాయంత్రం ద్వారకాతిరుమలకు చేరాడు ఈ బాలుడు. తప్పిపోయి వచ్చాడేమోనన్న అనుమానంతో స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
దీంతో బాలుడిని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజుకు అప్పగించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఏలూరు నుంచి ఒక ఆర్టీసీ బస్సు సాయంత్రం ద్వారకాతిరుమల కొత్త బస్టాండుకు వచ్చింది. బస్సు నుంచి బాలుడు దిగకపోవడంతో కండక్టర్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించింది.
తన పేరు ఏసు అని అక్షయ్ అని, తనది ఏలూరు పాత బస్టాండు అని, దెందులూరని, విజయవాడ అని, తన తండ్రే బస్సు ఎక్కించాడని బాలుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో స్థానికులు బాలుడిని పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలు తెలిసిన వారు 94407 96653, 08829 – 271433 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
Comments
Please login to add a commentAdd a comment