
సాక్షి, మెదక్: జిల్లాలోని దంతాన్‌పల్లిలో ఉన్నదేవాదాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ ధర్మారెడ్డిని ఆదేశించారు. మంత్రి శనివారం దంతాన్‌పల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గుండ్లపల్లిలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిచారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాకు పీఎమ్‌జీ రోడ్లకు రూ.112 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో భాగంగా రూ.13 కోట్లు, రెండో విడతలో రూ.10 కోట్లు మంజూరు అయినటట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. (తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్)
Comments
Please login to add a commentAdd a comment