ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్‌ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.
నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్‌లో ఒక రోజు పని చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i
— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment