
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్‌లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్‌లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.
If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1
— Harsh Goenka (@hvgoenka) October 8, 2024
ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది.