సాక్షి, ముంబై: ఇండియాలో ఇ-మొబిలిటీ మార్కెట్‌లో ఓలా భారీ వ్యూహాలనే రచిస్తోంది. ఇప్పటికే ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇపుడిక ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.
ఇదీ చదవండి : ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ పైప్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను చేర్చింది. త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్ లేదా కేఫ్ రేసర్ ఏది కావాలి అంటూ ట్విటర్ తన ఫాలోnయర్లను అడిగారు భవిష్ అగర్వాల్. అయితే ఆసక్తికరంగా స్పోర్ట్స్ కేటగిరీ అత్యధిక ఓట్లను పొందుతోంది. వచ్చే ఏడాది బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Building some 🏍️🏍️!!
— Bhavish Aggarwal (@bhash) November 10, 2022
రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా సరసమైన ధరలో, ఆధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నందని అంచనా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఆదరణ బాగా లభించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?)
Which bike style do you like
— Bhavish Aggarwal (@bhash) November 10, 2022
Comments
Please login to add a commentAdd a comment