
ప్రముఖ రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 1 మిలియన్ రిజర్వేషన్లు వచ్చినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. అలాగే, డిసెంబర్ 15 నుంచి మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జపాన్ దేశానికికు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతుతో భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన కేంద్రంగా మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2023లో ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలని చూస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
ఎలక్ట్రిక్ కార్లు
భారతదేశంలో ఉబెర్ కంపెనీతో పోటీపడుతున్న రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అనేక ప్రపంచ మార్కెట్లలో తన ఉనికిని విస్తరిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే ఓలా ఎలక్ట్రిక్ 2023 నాటికి తన తొలి ఎలక్ట్రిక్ కారును ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. గ్లోబల్ ఎలక్ట్రిక్ వేహికల్ హబ్‌గా ఇండియాను తయారు చేయడమే తన ఆశయమని పేర్కొన్న అగర్వాల్, డిసెంబర్ 15 నుంచి ఈవీ స్కూటర్లను డెలివరీ చేసే పనిలో ఉన్నట్లు రాయిటర్స్ నెక్ట్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో చెప్పారు.
(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!)
ఐపీఓ ప్రణాళికలు
ఓలా వచ్చే సంవత్సరం 2022 తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతుతో వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణ సేవలు అందించేందుకు 'సూపర్ యాప్' రూపకల్పనను వేగవంతం చేసినట్లు అగర్వాల్ వెల్లడించారు.
(చదవండి: దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment