
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు రుణ సదుపాయం అందుబాటులోకి తెచ్చే దిశగా పలు బ్యాంకులు, ఆరి్థక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లో ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. సెపె్టంబర్ 8 నుంచి వీటిలో కొన్ని ఆరి్థక సంస్థలు రుణాలివ్వడం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్లను అక్టోబర్ నుంచి డెలివరీ చేయనుంది. వీటిలో ఎస్1 ధర రూ. 99,999 కాగా, ఎస్1 ప్రో ధర రూ. 1,29,999గా ఉంది. దరఖాస్తుదారుకు ఎంత రుణం వస్తుంది తదితర వివరాలు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చని, ఎస్1కి సంబంధించి ఈఎంఐ అత్యంత తక్కువగా రూ. 2,999 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే తెలిపారు.