
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్‌తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్‌బోర్డ్‌ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.
ఈ స్కూటర్‌ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?
ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment