ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్‌స్క్రిప్షన్‌లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్‌స్క్రిప్షన్‌లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.
ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.
ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment