
ప‍్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ 'ఓలా' బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ ఓన్డ్ (పాత) కార్లపై రూ.1లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఓలాఎలక్ట్రిక్ బైక్‌తో రికార్డ్‌లను సృష్టిస్తున్న ఓలా సంస్థ.. కార్ల ప్లాట్ ఫామ్‌లో సత్తా చాటేందుకు సరికొత్త బిజినెస్ మోడల్‌ను లాంఛ్ చేసింది.
ఈ దివాళీ సందర్భంగా ఓలా ప్రీ ఓన్డ్ ఫెస్టివల్ ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో ఓలా సంస్థ 2వేల కొత్త కార్లు, పాత కార్లను అమ్మకాలకు పెట‍్టింది. ఈ సేల్‌లో భాగంగా పాత కార్లను కొనుగోలు చేస్తే..ఆ కారుపై లక్ష వరకు డిస్కౌంట్ అందించనుంది. దీంతో పాటు 2 సంవత్సరాల వరకు ఉచిత సర్వీసింగ్,12 నెలల వారంటీ, 7రోజుల రిటర్న్ పాలసీని అమలు చేయనుంది.
ఈ సందర్భంగా ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేశ్‌ముఖ్ మాట్లాడుతూ..ఈ ఏడాదిలోపు 'ఓలా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 100 పాత కార్లను అమ్మేలా టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. అంతేకాదు ఓలా యాప్ ద్వారా కొత్త, పాత కార్లను అమ్మడంతో పాటు కస్టమర్లకు పలు సర్వీసుల్ని అందించనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు,వాహన ఫైనాన్స్,బీమా, రిజిస్ట్రేషన్,వెహికల్ కండీషన్, పనితీరు,నిర్వహణను పరిశీలించిన తర్వాతనే కస్టమర్లు కార్లను అమ‍్మనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏదైనా సమస్య వస్తే ఎలా..! కంపెనీ ఏం చెప్తుంది..?
Comments
Please login to add a commentAdd a comment