old cars
-
అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది
బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane)ప్రీమియర్ పద్మినిప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు. -
పాత కార్లలో యూత్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్లైన్ యూజ్డ్ కార్ల మార్కెట్‌ప్లేస్ కంపెనీ కార్స్24 నివేదిక చెబుతోంది. కొనుగోలుదార్లదే మార్కెట్.. పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్ మోటార్స్ ఎండీ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై.. పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్లైన్ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్ కార్ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది. -
బంపర్ ఆఫర్.. కారు కొంటే లక్ష వరకు డిస్కౌంట్..!
ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ 'ఓలా' బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ ఓన్డ్ (పాత) కార్లపై రూ.1లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఓలాఎలక్ట్రిక్ బైక్‌తో రికార్డ్లను సృష్టిస్తున్న ఓలా సంస్థ.. కార్ల ప్లాట్ ఫామ్‌లో సత్తా చాటేందుకు సరికొత్త బిజినెస్ మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ దివాళీ సందర్భంగా ఓలా ప్రీ ఓన్డ్ ఫెస్టివల్ ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లో ఓలా సంస్థ 2వేల కొత్త కార్లు, పాత కార్లను అమ్మకాలకు పెట్టింది. ఈ సేల్‌లో భాగంగా పాత కార్లను కొనుగోలు చేస్తే..ఆ కారుపై లక్ష వరకు డిస్కౌంట్ అందించనుంది. దీంతో పాటు 2 సంవత్సరాల వరకు ఉచిత సర్వీసింగ్,12 నెలల వారంటీ, 7రోజుల రిటర్న్ పాలసీని అమలు చేయనుంది. ఈ సందర్భంగా ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేశ్‌ముఖ్ మాట్లాడుతూ..ఈ ఏడాదిలోపు 'ఓలా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 100 పాత కార్లను అమ్మేలా టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. అంతేకాదు ఓలా యాప్ ద్వారా కొత్త, పాత కార్లను అమ్మడంతో పాటు కస్టమర్లకు పలు సర్వీసుల్ని అందించనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు,వాహన ఫైనాన్స్,బీమా, రిజిస్ట్రేషన్,వెహికల్ కండీషన్, పనితీరు,నిర్వహణను పరిశీలించిన తర్వాతనే కస్టమర్లు కార్లను అమ్మనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏదైనా సమస్య వస్తే ఎలా..! కంపెనీ ఏం చెప్తుంది..? -
భారీ షాక్: పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు భారీగా పెంపు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది. ఇక పాత బైక్‌ల రెన్యువల్ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. మరోవైపు, 15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ. 12,500 (ప్రస్తుతం రూ. 1,500), మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి రూ. 10,000 చార్జీలు వర్తిస్తాయి. దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 10,000, కార్లకు రూ.40,000 కట్టాల్సి ఉంటుంది. అదనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ తరహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే ప్రతి నెలకు రూ. 300 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి. అదే వాణిజ్య వాహనాలకైతే ఇది రూ. 500. చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు! -
కొత్త వాహనంపై 5 శాతం రిబేటు
న్యూఢిల్లీ: స్క్రాపేజీ (తుక్కు) విధానం కింద పాత కార్లను వదిలించుకుని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఇలా కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు ఇస్తారు‘ అని ఆయన తెలిపారు. ‘స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్నెస్ టెస్టు, పొల్యూషన్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి. టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లు అవసరం. వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాం’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇక స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌కు వరం.. స్క్రాపేజీ విధానం.. ఆటోమొబైల్ రంగానికి వరంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. దీనితో అత్యంత లాభసాటి రంగంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగగలదని, భారీ స్థాయిలో ఉపాధి కల్పించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు. స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు. -
పాత కారు.. యమా జోరు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల కంటే పాత వాటికే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2018–19లో 33.7 లక్షల కొత్త కార్లు రోడ్డెక్కగా... అదే సమయంలో ఏకంగా 40 లక్షల పాత కార్లు చేతులు మారాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే 2018–19లో కొత్త కార్ల అమ్మకాల వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. నాలుగేళ్లలో ఇదే తక్కువ వృద్ధి రేటు కూడా!!. అదే పాత కార్ల విషయానికొస్తే... ఈ వృద్ధి 6–7 శాతం మధ్య ఉండటం గమనార్హం. వాల్యూ ఫర్ మనీ.. పాత కారుకు కస్టమర్లు ఆకర్షితులు కావటానికి ప్రధాన కారణం వారు తాము చెల్లించే డబ్బుకు తగ్గ విలువ ఉండాలని ఆశిస్తున్నారని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ చెబుతోంది. ‘‘కొత్త కారు కొనాలనుకుంటే... ఆ ధరకే లేదా అంత కంటే తక్కువ ఖరీదుకే ఇంకా పెద్ద కారు వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నలుగురు వ్యక్తుల్లో ఒకరు మాత్రమే కొత్త కారు కొంటున్నారు. మిగిలిన ముగ్గురు ప్రీ ఓన్డ్ కారుకు సై అంటున్నారు’’ అని ట్రూబిల్ కో–ఫౌండర్ శుభ్ బన్సాల్ చెప్పారు. ఇప్పుడు భారత్‌లో ప్రీ ఓన్డ్ విభాగంలోనే అధిక విక్రయాల ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. పాత కార్ల విషయంలో వాల్యూ చూసేవారు 15 శాతం మంది ఉంటున్నారు. తక్కువ కాలానికి వాడి తిరిగి విక్రయించాలని భావించేవారు 23 శాతం కాగా, తక్కువ ధరకు వస్తుంది కాబట్టి కొనుగోలుకు మొగ్గు చూపేవారు 62 శాతం మంది ఉంటున్నారట. తరచూ మారుస్తున్నారు.. దశాబ్దం క్రితం ఒక్కో కస్టమర్ తమ కారును పదేళ్లపాటు అట్టి పెట్టుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ కస్టమర్ల సంఖ్య ఎక్కువ కావటంతో 3– 5 ఏళ్లకే కారును మారుస్తున్నారు. మరీ పాత వాహనమైతే సేల్ వాల్యూ రాదు. చాలా సందర్భాల్లో మూడేళ్ల పాతది కొత్త కారు మాదిరిగా ఉంటోందట. దీంతో చాలా మంది కస్టమర్లు పాత కారుకు ఓకే చెబుతున్నారు. మూడేళ్లలోపు తిరిగిన కారును కోరేవారు 27 శాతం, 4–5 ఏళ్లు వాడిన కారును కోరుకునేవారు 45 శాతం మంది ఉన్నారన్నది విక్రయదారుల మాట. 46 శాతం మంది యజమానులు మాత్రం తమ కారును 6–8 ఏళ్లు వాడిన తర్వాతే అమ్ముతున్నారు. 3– 5 ఏళ్లకే కారును విక్రయిస్తున్న వినియోగదార్లు పెద్ద కారు లేదా ఉత్తమ మోడల్‌కు అప్డేట్ అవుతున్నారు. వ్యవస్థీకృత రంగంవైపు.. ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్లో వ్యవస్థీకృత రంగ విభాగ వాటా తక్కువే ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. 2016–17లో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం ఉంటే 2018– 19 నాటికి 18 శాతానికి చేరింది. వ్యవస్థీకృత రంగ కంపెనీలు ప్రీ ఓన్డ్ కార్ల సేల్స్ కోసం షోరూంలు తెరుస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సొంతంగా ప్రీ ఓన్డ్ కేంద్రాలను ఆపరేట్ చేస్తుండడం విశేషం. సొంత బ్రాండ్ కార్లనేగాక ఏ కంపెనీ కార్లనైనా ఇవి కొనటం, అమ్మటం చేస్తున్నాయి. వ్యవస్థీకృత రంగంలోని ప్రీ ఓన్డ్ కేంద్రాల్లో కార్లకు నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేసి మంచి కండీషన్‌కు తీసుకొచ్చాకే విక్రయిస్తారు. సర్టిఫై చేసి వారంటీతో అమ్ముతారు. కారు కొనేందుకు రుణం సులభంగా వస్తుంది. ఇక కస్టమర్ నుంచి కస్టమర్‌కు జరుగుతున్న వ్యాపారం 32 శాతంగా ఉంది. అవ్యవస్థీకృత రంగం 17 నుంచి 16 శాతానికి తగ్గింది. సెమి– ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ 36 నుంచి 34 శాతంగా ఉంది. ఫైనాన్స్ 17 శాతమే.. పాత కార్ల విక్రయాలు పెరుగుతున్నప్పటికీ కొత్త కార్లతో పోలిస్తే ఫైనాన్స్ లభ్యత తక్కువగా ఉంటోంది. 75 శాతం కొత్త కార్లకు రుణ సదుపాయం లభిస్తే, పాత కార్ల విషయంలో ఇది 17 శాతమే. ఫైనాన్స్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతోపాటు వినియోగదారుకు క్రెడిట్ కార్డు లేదా లోన్ హిస్టరీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కొత్త కారుపై ఉండే వడ్డీ రేటు కంటే పాత కారుపై వడ్డీ రేటు కస్టమర్, వాహన విలువను బట్టి 2– 5 శాతం ఎక్కువ ఉంటోంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో విక్రయ కంపెనీలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో చేతులు కలిపి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. సులువుగా రుణం వచ్చేలా చేస్తున్నాయి. మరో విషయమేమంటే అవ్యవస్థీకృత రంగంలో పాత కారుకు విలువ కట్టడం అంత ఈజీ కాదు. ప్రామాణికత లేకపోవడంతో చాలా సందర్భాల్లో బ్రోకర్లదే తుది నిర్ణయంగా ఉంటోంది. కారు మోడల్, తిరిగిన కిలోమీటర్లు, వయసు, రంగు, నగరం కూడా ధరను నిర్ణయిస్తాయి. (సోర్స్–మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్) -
అధి‘కార్’.. బేకార్
‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్నట్టు...ప్రభుత్వ వాహనాలు ‘తుప్పు’ పట్టిపోతున్నాయి. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో..అలనాటి అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఇలా ఖరీదైన వాహనాలెన్నో సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయాయి. ఈ వాహనాలు ఎందుకువినియోగించడం లేదో తెలియడం లేదు. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో.. ఇంకా అలనాటిరాజ వాహనం అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఎన్నో అక్కడ పడివున్నాయి. ఎవరికీ పట్టనట్టున్నాయి. దుమ్ము కొట్టుకుపోయి.. శిథిలమైపోయి, పాక్షికంగా పాడైపోయి, పార్టులు పీకేసి.. చెట్ల కింద.. గోడ పక్కనా కార్లే. ఎటుచూసినా కార్లే. పదో, ఇరవయ్యో కాదు.. సుమారు 200 కార్లు. ఈఎంఐలు కట్టలేక దుబాయ్ ఎయిర్‌పోర్టులో కార్లు వదిలేసినవి కావు. నగరం నడిబొడ్డునున్న సెక్రటేరియట్లో కనిపించే పరిస్థితి ఇది. ప్రతి కారుకు ‘గవర్నమెంట్ వాహనం’ అన్న బోర్డులు సైతం ఉన్నాయి. ఎవరికోసం కొనుగోలు చేశారో.. ఎంతకాలం వాడారోగాని ఇప్పుడు ఎవరికీ కాకుండావదిలేయడంతో తుప్పు పట్టిపోతున్నాయి. వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతోఆదాయం సమకూరేది. కానీ ఎవరికీ పట్టనట్టు వదిలేశారు. – ఫొటోలు: ఎం. అనిల్‌కుమార్ -
వింటేజ్ సొగసు చూద్దామా..