ఓలా ఎలక్ట్రిక్‌ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ ! | Ola Electric to raise USD 300 million for expansion plan | Sakshi
Sakshi News home page

ఓలా ఎలక్ట్రిక్‌ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !

Mar 22 2023 6:37 PM | Updated on Mar 22 2023 6:40 PM

Ola Electric to raise USD 300 million for expansion plan - Sakshi

బెంగళూరు: ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్‌ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్‌ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (రూ. 2,475 కోట్లు) సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే నష్టాల నుంచి బయటపడి, లాభాలు ఆర్జించగలదన్న అంచనాల నడుమ కంపెనీ తాజా నిధుల సమీకరణకు తెరతీయడం ప్రాధాన్యతను   సంతరించుకుంది. 

(ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్‌ ఆగ్రహం)

2023, 2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్‌సైకిల్, మల్టిపుల్ ప్రీమియం బైక్స్‌  లాంటి  మరిన్ని ఎలక్ట్రిక్  టూ వీలర్స్‌ను లాంచ్ చేయాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. అలాగే  2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే మొత్తం టూవీలర్స్‌, 2030 నాటికి  దేశంలో విక్రయించేకార్లన్నీఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కావాలనేది  కంపెనీ మిషన్ ఎలక్ట్రిక్  లక్క్ష్యమని  ప్రకటించిన సంగతి  తెలిసిందే.  (రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే)

దీనికి తోడు ఇటీవలే  తమిళనాడు  క్రిష్ణగిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ  హబ్‌ను ఏర్పాటు చేయడానికి భూమి సేకరణకు అక్కడి ప్రభుత్వంతో MOU సంతకం కుదుర్చుకుంది ఓలా. ఇందులోసెల్ ఫ్యాక్టరీ, ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ, సప్లయర్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోందని  తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement