ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడేళ్ళ క్రితమే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ప్రెజెక్టును నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వల్ వెల్లడించారు.
ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల ప్రారభంలో ఐపీఓ ప్రారంభించిన తరువాత లాభాలను ఆర్జించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు భవిష్ అన్నారు.
నిజానికి 2022లో పుల్ గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయబోతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఆ తరువాత అదే ఏడాది ఆగష్టు 15న జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ కారుకు సంబంధించిన స్కెచ్‌లు విడుదల చేశారు. అప్పట్లోనే ఈ కారు తయారు కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
భారతదేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి సవాలుగా ఓలా ఎలక్ట్రిక్ సింగిల్ చార్జితో 500 కిమీ రేంజ్ అందించే కారును లాంచ్ చేయనున్నట్లు ఎప్పుడో చెప్పింది. కానీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐపీఓకు వెళ్లడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలన్న ఓలా నిర్ణయాన్ని భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. అయితే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మళ్ళీ ప్రారంభమవుతుందా? లేదా? అనే విషయాలను సీఈఓ స్పష్టం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment