ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఆటోమొబైల్ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్ హచ్ బ్యాక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఓలా అధినేత భవిష్ అగర్వాల్ రైడ్ షేరింగ్ రంగం నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంపై కన్నేశారు. ఇప్పటికే టూవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసిన భవిష్..భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా త్రీ వేరియంట్ కార్ల ఫస్ట్ టీజర్‌లను ఇటీవల నిర్వహించిన కస్టమర్ డే ఈవెంట్‌లో రివిల్ చేశారు. ఆ టీజర్ ఫోటోలు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా..ఆగస్ట్ 15న ఓలా ఆ కార్లకు సంబంధించి పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా.. ఆ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు వెలుగులోకి వచ్చాయి.
ఆ వివరాల ప్రకారం..ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓలా కార్లు ఎస్‌యూవీ, హచ్‌బ్యాక్, సెడాన్ ఇలా మూడు వేరియంట్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కూపీ మోడల్, లో సంగ్ల్ స్టాన్స్,మజిలర్ బాడీ, స్టీప్ రూఫ్‌లైన్ స్పెసిఫికేషన్‌లు ఉండగా..ఒక కారు మాత్రం అప్ రేర్ ఎండ్, యూ షేప్‌డ్ ఆకారంలో టెయిల్ ల్యాప్ డిజైన్‌లు ఉన్నాయి.
ఇక స్పోర్ట్స్ హచ్ బ్యాక్‌లో స్టబీ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విడుదలైన ఈ టీజర్‌లో ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ డిజైన్, షార్ప్ ఎడ్జ్‌లు,రెండు షేడ్‌లతో మూడు కార్లు దర్శనమిస్తున్నాయి.
ఈ డిజైన్‌లతో పాటు..సెడాన్ వేరియంట్‌లలో ఓలా అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీపై వర్క్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
Comments
Please login to add a commentAdd a comment