Ola Electric: రెండు రోజులకు ముందు (అక్టోబర్ 28) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగిన సంఘటన మీద కంపెనీ (ఓలా ఎలక్ట్రిక్) స్పందిస్తూ, ప్రమాదానికి కారణాలను వెల్లడించింది. దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పూణేలోని పింప్రి - చించ్వాడ్ ప్రాంతంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇందులో స్కూటర్ నుంచి పొగలు రావడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు వంటి దృశ్యాలను చూడవచ్చు.
ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా?
ఈ విషయంపై ఓలా కంపెనీ స్పందిస్తూ.. కంపెనీకి చెందినవి కాకుండా ఇతర పరికరాలను స్కూటర్‌లో ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి, ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు, బ్యాటరీ కూడా చెక్కుచెదరకుండా ఉపయోగించడానికి అనువుగానే ఉందని స్పష్టం చేసింది.
Important update pic.twitter.com/K7pw71Xoxo
— Ola Electric (@OlaElectric) October 29, 2023
Comments
Please login to add a commentAdd a comment