గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారి తర్వాత 2021లో శర వేగంగా పుంజుకున్న రంగాలలో ఎలక్ట్రిక్ వాహన రంగం చాలా ముఖ్యమైనది. ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రాకెట్ కంటే వేగంగా దూసుకుకెళ్లాయి. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం పోట పోటీగా అన్నీ ఈవీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్‌తో తమ వాహనలను మార్కెట్లోకి దించాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. 2021లో ద్విచక్ర వాహన విభాగంలో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓలా ఎస్1
ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ అయ్యింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ లాంచ్ చేసింది. బేస్ మోడల్ ఎస్1 ధర ₹85,099(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)కు, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రోను ₹1,10,149(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఎస్1 స్కూటర్ 2.98 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.
దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా ఓలా యాజమాన్య బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ (బిఎమ్ఎస్)తో వస్తాయి.
(చదవండి: ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!)
సింపుల్ వన్
ఓలా ఎలక్ట్రిక్ లాంఛ్ చేసిన తర్వాత బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) స్టార్టప్ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ స్కూటర్ లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్టబుల్ 4.8 కిలోవాట్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో గల లిథియం-అయాన్ బ్యాటరీని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది.
ఈవీ సోల్
ఈవీ ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సోల్'ను రూ.1.39 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూరోపియన్ టెక్నాలజీ ప్రమాణాల ఆధారంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఐఓటీ ఎనేబుల్డ్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, జీపీఎస్ నావిగేషన్, యుఎస్‌బి పోర్ట్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ జియో ట్యాగింగ్, కీలెస్ ఫీచర్, రివర్స్ మోడ్, జియో ఫెన్సింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది.
బౌన్స్ ఇన్ఫినిటీ
బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్ఠింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బౌన్స్. బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు.
కొమాకి టిఎన్95
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కొమాకి ఈ ఏడాది ప్రారంభంలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల(టిఎన్95, ఎస్ఈ, ఎమ్5)ను లాంచ్ చేసింది. టిఎన్95 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.₹98,000, ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.96,000గా ఉంది. ఇక ఎమ్5 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ.99,000 ధరకు లాంచ్ చేసింది. టిఎన్95 ఎలక్ట్రిక్ స్కూటర్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ -స్కూటర్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే100 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఫుల్ కలర్ డిజిటల్ డిస్ప్లే, పార్క్, రివర్స్ అసిస్ట్, ఆన్-బోర్డు క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్-డయాగ్నసిస్ స్విచ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment