సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ తేదీలను ప్రకటించిన సింపుల్ ఎనర్జీ..! | Deliveries of Simple One Electric Scooter to Commence From June | Sakshi
Sakshi News home page

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ తేదీలను ప్రకటించిన సింపుల్ ఎనర్జీ..!

Published Wed, Jan 12 2022 3:34 PM | Last Updated on Wed, Jan 12 2022 3:34 PM

Deliveries of Simple One Electric Scooter to Commence From June - Sakshi

ఎలక్ట్రిక్ వాహన ప్రియలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దం అయ్యింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ ఈ ఏడాది(2022) జూన్ నుంచి తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ డెలివరీలను ప్రారంభించనున్నట్లు బుధవారం(జనవరి 12) ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్ ఇప్పటివరకు 30,000కు పైగా ప్రీ బుకింగ్స్ అందుకుంది. తమిళనాడులోని హోసూరులో ఉన్న తయారీ కేంద్రంలో వీటిని ఉత్పత్తి చేయనున్నారు.

రూ.2500 కోట్లు పెట్టుబడి
ఈ తయారీ కేంద్రం వార్షిక సామర్థ్యం 1 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం స్కూటర్ల తయారీకి ఈ ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంది. సింపుల్ ఎనర్జీ తమిళనాడులోని ధర్మపురిలో రెండవ తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది 600 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ఇది ఏడాదికి 12.5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఉత్పత్తి కేంద్రంగా నిలవనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ గిగా ఫ్యాక్టరీలో మొదటి దశ ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మొత్తంగా సింపుల్‌ వన్‌ రూ.2500 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యింది. 

236 కిలోమీటర్ల రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కిలోల బరువున్న 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డిటాచబుల్, పోర్టబుల్ స్వభావం వల్ల ఇంటి వద్ద ఈ-స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని సింపుల్ లూప్ ఛార్జర్ సహాయంతో 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు వాహనాన్ని ఛార్జ్ చేయవచ్చు. ఈ-స్కూటర్‌ను సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇండియన్ డ్రైవ్ సైకిల్(ఐడీసీ) పరిస్థితుల్లో 236 కిలోమీటర్ల రేంజ్ అందించినట్లు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే, 2.95 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్ చేయగలదు. స్కూటర్ కు 4.5 కెడబ్ల్యు పవర్ అవుట్ పుట్, 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

(చదవండి: ఆ రెండు దేశాల్లో ఫేస్‌బుక్‌కు గట్టి దెబ్బ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement