
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలిసారి తన యూజర్లుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. అందులోనూ ఈ ఫెస్టివ్ సీజన్‌లో కసమర్లను ఆకట్టు కునేలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 10వేల వరకు తగ్గింపు ధరకు అందిస్తామని ప్రకటించింది.
ఎస్1 ప్రో లాంచింగ్ ధర 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్). తాజా ఆఫర్‌తో దీనిపై 10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, పండుగ విక్రయం కోసం కొనుగోలు విండో ఇప్పటికే ప్రత్యక్షంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ‘‘ఓలా పండుగ ఆఫర్‌ను ఉపయోగించు కోండి, ఎస్ 1 ప్రో 10,000 తగ్గింపుతో పండగ చేస్కోండి.. ఇతర ఫైనాన్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ దసరా (అక్టోబర్ 05, 2022న) వరకు చెల్లుబాటులో ఉంటుంది’’ అని తెలిపింది.
ప్రత్యేక ఆఫర్‌ను పొందేందుకు, వినియోగదారులు ఓలా అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. పండుగ ఆఫర్ ట్యాబ్‌ను క్లిక్ చేసిన తర్వాత, ఆసక్తి గల కస్టమర్‌లు ఎస్1 ప్రోని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలా వివరాలను నమోదు చేసిన తరువాత ఓలా ఎస్1 ప్రోను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment