
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వాహనదారుల్లో అవగాహన పెరిగిపోతుండడం, ఆర్ధిక పరమైన అంశాలు కలిసి రావడంతో ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు.
రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. ఆర్ధిక సంవత్సరం 2023లో దాదాపూ 7.3లక్షల ఈవీ టూ వీలర్ వెహికల్స్ అమ్ముడు పోయ్యాయి. ఈ వెహికల్స్ అమ్మకాలు ఆర్ధిక సంవత్సరం 2022 కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈవీ ద్విచక్రవాహనాల విభాగంలో 22 శాతం మార్కెట్ వాటాతో ఓలా అగ్రస్థానంలో కొనసాగుతుంది. మార్చి త్రైమాసికంలో దాని వాటా 30 శాతానికి చేరుకుంది. "ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు, టెక్-ఫస్ట్ ప్రొడక్ట్ వంటి అంశాలు ఓలాకు కలిసి వచ్చాయని రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓలా ఎలక్ట్రిక్ బాస్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఈవీ రంగం సాంకేతికతతో కూడుకున్నది. అందులో ఒకటి సాఫ్ట్‌వేర్, బ్యాటరీ. ఈ రెండింటిలోనూ మాకు నైపుణ్యం ఉందని అన్నారు. కాబట్టే తమ సంస్థ ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవడంలో పోటీపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment