ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఓలా అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తోంది. ఓలా మార్చి నెలలో 27వేల కంటే ఎక్కువ వెహికల్స్‌ను విక్రయించినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా కంపెనీ తన భవిష్యత్ కార్యకలాపాల గురించి వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ లక్ష్యాలను నిర్ధేశించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా తొలుత సంస్థ ప్రస్తుతం 400 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను కలిగి ఉంది. ఇలాంటివి మరో 50కు పెంచాలని యోచిస్తుంది. తద్వారా 90 శాతం మంది కస్టమర్లు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నట్లు పేర్కొంది.
ఇక రాబోయే రెండేళ్లలో కంపెనీని మరింత విస్తరించేలా కార్పోరేట్ అవసరాలు తీర్చుకోవడానికి 300 బిలియన్ డాలర్లను గోల్డ్‌మన్ శాక్స్ నుంచి సేకరించనుంది. కాగా, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.79,999గా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment