వాహనదారులకు ఓలా బంపరాఫర్‌! | Ola Announces Bharat Ev Fest Offers | Sakshi
Sakshi News home page

Ola Electric: వాహనదారులకు ఓలా బంపరాఫర్‌!

Published Tue, Oct 17 2023 7:43 PM | Last Updated on Tue, Oct 17 2023 8:49 PM

Ola Announces Bharat Ev Fest Offers - Sakshi

దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో ఇప్పటికే ఈకామర్స్‌ కంపెనీలు కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థ ఓలా కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది.

అక్టోబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 30 వరకు ‘భారత్‌ ఈవీ ఫెస్ట్‌’ పేరుతో నిర్వహిస్తున్న సేల్స్‌లో డిస్కౌంట్స్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్‌ని అందిస్తున్నట్లు తెలిపింది. 

భారత్‌ ఈవీ ఫెస్ట్‌లో ఎస్‌1 ప్రో- సెకండ్‌ జనరేషన్‌ బ్యాటరీపై వారెంటీ పొడిగింపుతో పాటు ఎస్‌1 ఎయిర్‌పై  5ఏళ్ల వారెంటీపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ బోన్‌స్‌ కింద రూ.10,000 రాయితీ ఉంటుంది. 

వాహనదారుడి పాత పెట్రోల్‌ వాహనం ఇచ్చి కొత్త ఓలా ఎస్‌1 ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది.  

టెస్ట్‌ రైడ్‌ స్కీంలో భాగంగా ఎంపిక చేసిన లక్కీ కస్టమర్‌కు ఉచితంగా ఓలా సిక్స్‌ ప్లస్‌ వెహికల్‌ను అందిస్తుంది. 

ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డ్‌పై కొనుగోలు రూ.7,500 వరకు ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఒకవేళ ఓలా వెహికల్‌ను మీ ఫ్రెండ్స్‌, స‍్నేహితులకు రిఫర్‌ చేసి, వాళ్లు కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌ బ్యాక్‌తో పాటు ఎగ్జిస్టింగ్‌ డిస్కౌంట్స్‌ పొందవచ్చని ఓలా ఈ సందర్భంగా ప్రకటించింది. 

అంతేకాదు, వెహికల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకి జోరో డౌన్‌ పేమెంట్‌, జీరో కాస్ట్‌ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్‌ ఫీజులను పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement