Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి ఒక వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి, ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్‌పై తాజాగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ చార్జింగ్, క్వాలిటీ దుమారం మరోసారి వెలుగులోకి వచ్చింది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం)
20 శాతం చార్జ్‌కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ సమస్యలను పరిష్కరించడంలో ఓలా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు ఒక బ్యానర్‌తో సహా స్కూటర్‌ను నిలిపాడు. ఏడాది కాలంగా స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాను..ఈ స్కూటర్‌ను వదిలి వెళ్లినప్పటి నుంచి తనకు సర్వీస్ సెంటర్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని పేర్కొన్నాడు. అలాగే స్కూటర్‌లోని అలైన్‌మెంట్ బుష్ ఐదుసార్లు మార్చానని కూడా పేర్కొన్నాడు. (సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు.. తగ్గేదేలే!)
దీనికి సంబంధించి ఫొటోను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ అనే ట్విటర్ ఖాతాలో ఇది పోస్టు అయింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకాదు.. ఇదో అధ్వాన్నమైన సర్వీస్ సెంటర్ అని కమెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పోస్ట్ క్రింద, తమ కెదురైన అనుభవాలను ఓలా స్కూటర్ కస్టమర్‌లు ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. ఓలాను స్కామ్ కంపెనీ అని మరొకరు పేర్కొన్నారు. అయితే దీనిపై ఓలా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం వివరాలను కోరినట్టు తెలుస్తోంది.
#News #OLAElectricComplaints #OLAElectric #CustomersProtesthttps://t.co/PhFDv1dulT
— Ola Electric #Parody (@OlaEV_parody) July 19, 2023
అయితే ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. గతంలో ఓలా S1 స్కూటర్లపై కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ స్కూటర్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.
Calicut ola service center
— fasil (@fasilfaaaz) July 19, 2023
work overload
approx 200 scooters work pending
Service slot not available now
We also need two service centers
Please resolve this as soon as possible@bhash @OlaElectric pic.twitter.com/mhT7vD3ltJ
Comments
Please login to add a commentAdd a comment