దేశీయ ఎలక్ట్రిక్ ఆటో మొబైల్ తయారీ సంస్థ "ఓలా ఎలక్ట్రిక్" తన దూకుడు పెంచింది. దక్షిణాసియా మార్కెట్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇటీవల నిదుల సమీకరణ కోసం కొత్త చేపట్టిన కొత్త ఫైనాన్సింగ్ రౌండ్‌లో 200 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ 2 ఫైనాన్సింగ్ రౌండ్‌కు సహ నాయకత్వం వహించాయి అని బెంగళూరుకు చెందిన స్టార్టప్ తెలిపింది. టెక్ క్రంచ్ గత నెలలో ఈ స్టార్టప్ 2.75 బిలియన్ డాలర్లకు పైగా సేకరించడానికి చర్చలు జరుపుతున్నట్లు నివేదించింది.(చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త!)
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్(ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రొ)ను లాంఛ్ చేసిన తర్వాత ఫండ్ రైజ్ చేయడం ఇది మొదటి సారి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఫుల్ చార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల(75 మైళ్ళు) దూరం వెళ్లనుంది. ఈ స్టార్టప్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్, స్కూటర్, ఎలక్ట్రిక్ కారుతో సహా ఇతర వాహనాలను తయారు చేయడానికి తాజాగా నిధులను మోహరించనున్నట్లు తెలిపింది. ఇటీవల ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్ పెట్రోల్ వాహనాలను నడుపుతున్న ప్రతి ఒక్కరూ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని కోరారు. ఓలా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు ఐపీఓ వస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఓ విలువ 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. 2021 నాలుగో త్రైమాసికంలో ఓలా ఐపీవో డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అందించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment