
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స ట్రెండ్ నడుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్ ట్రెండ్‌కి ఛార్జింగ్ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈవీ తయారీ సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది.
పెట్రోలు బంకుల్లో
పెట్రోల్ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లకు ఛార్జింగ్ సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోల్ బంకుల్లో ఓలా సంస్థ హైపర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవీశ్ అగర్వాల్ ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించారు.
రెండు నెలల్లో
భారత్ పెట్రోలు బంకుల్లో హపర్ ఛార్జింగ్ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్ ఛార్జింగ్ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు.
ఛార్జింగ్ ఫ్రీ
ఇక పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్ అగర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత్ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ 30 వరకు ఈ ఆఫర్‌ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంట్‌కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్ సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి.
Hypercharger roll out has begun across cities. At key BPCL pumps as well as residential complexes. 4000+ points up through next year.
— Bhavish Aggarwal (@bhash) December 28, 2021
We’re installing across India and will make them operational in 6-8 weeks. Will be free for use till end June 22 for all customers. pic.twitter.com/WKEzok4E98
అథర్‌కి పోటీగా
ఓలా కంటే ముందే ఈవీ మార్కెట్‌లో ఉన్న అథర్ సంస్థ సైతం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పెసిలిటీని కల్పించింది. 2021 డిసెంబరు 31తో ఈ గడువు ముగియగా తాజాగా 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే ఓలా నుంచి పబ్లిక్ హైపర్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రకటన వచ్చింది.
చదవండి:విశాఖలో ఓలా స్కూటర్ల డెలివరీ.. గెట్ రెడీ అంటున్న భవీశ్ అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment