శుభవార్త..!, ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి..! | Test drive of Ola S1, S1 Pro electric scooter began on November 10 | Sakshi
Sakshi News home page

Ola Electric: ఓలా బైక్‌, నవంబర్‌ 10 నుంచి టెస్ట్‌ రైడ్స్‌ ప్రారంభం

Published Wed, Oct 20 2021 6:34 PM | Last Updated on Wed, Oct 20 2021 8:42 PM

Test drive of Ola S1, S1 Pro electric scooter began on November 10 - Sakshi

వాహన కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్‌1 అండ్‌ ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్‌ స‍్కూటర్‌ ప్రీ బుకింగ్‌ చేసుకున్న కొనుగోలు దారులకు నవంబర్‌ 10న టెస్ట్‌ రైడ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఓలా అధికారికంగా ప్రకటించింది. 
 
ప్రీ బుక్‌ చేసుకున్న వాళ్లకు మాత్రమే 
ఇప్పటికే ఓలా ఎస్‌1 ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను ప్రీ బుక్‌ చేసుకున్న కొనుగోలు దారులు నవంబర్‌ 10 నుంచి టెస్ట్‌ రైడ్‌ నిర్వహిస్తున్నట్లు ఓలా మెయిల్‌ పెట్టింది. అంతేకాదు ఈ టెస్ట్‌ రైడ్‌ కంటే మిగిలిన మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుందని, అయితే వెహికల్‌ డెలివరీకి మాత్రం చెప్పిన టైమ్‌ ప్రకారం అందజేస్తామని తెలిపింది. అయితే ఈ వెహికల్‌ డెలివరీ నవంబర్‌ 25 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల లాంచ్‌ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. అమ్మకాలు ప్రారంభించిన రెండు రోజుల్లో రూ 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తాజాగా దీపావళి సందర్భంగా ఓలా ఎస్‌1,ఎస్‌1 ప్రో స్కూటర్ల అమ్మకాల్ని నవంబర్‌ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే ఈ ఫేజ్‌లో వెహికల్‌ బుక్‌ చేసుకున్న కొనుగోలు దారులకు డెలివరీ కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తుంది. 
 
ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ధర
ఓలా ఎస్‌1  ధర రూ.99,999 ఉండగా ఓలా ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999 ఉంది. ఇక వాహనకొనుగోలు దారులకు ఫేమ్‌2 స్కీంలో భాగంగా సబ్సిడీతో పాటు, రాష్ట్రాల్ని బట్టి అదనపు సబ్సిడీ ఉండనుంది. 

ఫైనాన్స్‌ ఆప్షన్‌లు ఉన్నాయా?
ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్‌లో ఫైనాన్స్‌ సౌకర్యం ఉంది. ఓలా ఎస్‌1 పై నెలవారీ ప్రారంభ ఈఎంఐ రూ.2,999 ఉండగా ఓలా ఎస్‌1ప్రోపై రూ.3,199 చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి: రెండు రోజుల్లో  రూ. 1100 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement