ఓలా అధినేత భవిష్ అగర్వాల్..టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మరోసారి ఝలక్ ఇచ్చారు. టెస్లాకు ధీటుగా తక్కువ ధరకే ఖరీదైన కార్లను పోలి ఉండేలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
భారత్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ అమెరికాకు చెందిన టెస్లాకు గట్టిపోటీ ఇస్తుంది. బిలియనీర్లు వినియోగించే పాష్ కార్లతో పోలి ఉండేలా ఓలా ఈవీ వెహికల్‌ను తక్కువ , సరసమైన ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. చీపెస్ట్ టెస్లా కారు ధర 50వేల డాలర్లు. అంత భారీ మొత్తంలో వెచ్చించి ఆ కారును కొనలేం.
అందుకే ఈవీ మార్కెట్‌లో సరికొత్త రెవెల్యూషన్‌తో టెస్లా కార్ల ధరల్ని 1000డాలర్ల నుంచి 50వేల డాలర్ల మధ్య ధరలతో వివిధ వేరియంట్ల కార్లను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
‘ఓలా స్టార్టప్ ప్రయాణం అంత సులువు జరగలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాం. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో వరల్డ్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. రానున్న పదేళ్లలో దేశీయ ఈవీ మార్కెట్ వ్యాల్యూ దశాబ్దం చివరి నాటికి 150 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నా.
ఓలా ఇందులో పాత్ర పోషించడం ఖాయం. ఎందుకంటే గత డిసెంబర్‌లో కొనుగోలు దారులు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది ఓలా గురించి వ్యతిరేక ప్రచారం చేశారు. అయినా ముందు సాగే దిశగా ఓలా సామ్రాజ్యాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’
‘చవకైన ఈవీలను తయారు చేయడం మాత్రమే కాకుండా, 5జీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ మొబిలిటీలో గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌ను పెంపొందించడం ద్వారా భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది’ అని అన్నారు.
చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment