బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్‌ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.
ఏథర్ 450ఎస్
భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.
శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్‌లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.
ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.
Ather’s second international market is set to go live by this festive!
First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳
❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment