దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి తేనున్నట్టు ప్రకటించింది.
2025 మార్చిలోగా ఎల్5 విభాగంలో ప్యాసింజర్ త్రీ–వీలర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.
మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్ గ్రీన్ గత నెలలో గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ) నుంచి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.
లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్ కార్ట్ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్ కోసం అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment