Kinetic
-
కైనెటిక్ ఫ్యామిలీ ఈ-స్కూటర్.. త్వరలో లాంచ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చిలోగా ఎల్5 విభాగంలో ప్యాసింజర్ త్రీ–వీలర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్ గ్రీన్ గత నెలలో గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ) నుంచి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్ కార్ట్ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్ కోసం అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. -
మిడిల్ క్లాస్ డ్రీమ్ వెహికల్: ఐకానిక్ లూనా సరికొత్తగా! రిపబ్లిక్ డే ఆఫర్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పుంజుకుంటోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు భారత్‌లో లాంచ్ కానుంది. ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్ లూనా స్కూటర్‌ను తాజాగా ఈవీ వెర్షన్లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ ఎవైటెడ్ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్ చేయనుంది. బుకింగ్‌లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్సైట్లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది. మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని తెలిపారు. అంతేకాదు 'చల్ మేరీ లూనా' అంటూ యాడ్ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి ఈ బ్రాండ్ కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్. నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని మయూర్ అండ్ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది Unleash the beats, charge up the streets, and ride the rhythm of the future on the Zulu! .#kineticgreen #kineticgreenev #kineticgreen2w #kineticgreenvehicles #kyaboltizulu #kineticgreenjourney #hiphop pic.twitter.com/h3rw3YzSRT — Kinetic Green (@KineticgreenEV) January 17, 2024 కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు కైనెటిక్ ఇ లూనాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్‌ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్అరౌండ్ టైమ్‌లను తగ్గించడానికి మార్చుకునే లేదా రిమూవముల్ బ్యాటరీ ప్యా క్తో డిజైన్ చేసింది. -
ముత్యమే.. కదులుతూంటుంది!
-
నాడు ‘చల్ మేరీ లూనా’.. త్వరలో ఏం అనబోతున్నారంటే..
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో నూతన స్టార్టప్‌లు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇదేసమయంలో పలు పాత కంపెనీలు కూడా మార్కెట్లో నూతన హంగులతో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 80-90 దశాబ్ధాలలో తన హవా చాటిన లూనా గురించి అందరికీ తెలిసేవుంటుంది. అదే లూనా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త హంగులతో వచ్చేందుకు సకల సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి లూనా ఎలక్ట్రిక్ అవతారంలో పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వానీ సోషల్ మీడియా మాధ్యమంలో తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన తండ్రికి సంబంధించిన పాత ఫొటోతో పాటు లూనా వింటేజ్ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో బ్లాస్ట్ ఫ్రమ్ ద పోస్ట్!!‘చల్ మేరీ లూనా’. దీని రూపకర్త నా తండ్రి, పద్మశ్రీ అరుణ్ ఫిరోదియా!కైనెటిక్ గ్రీన్ కు ఆధునిక మార్పులు చేస్తూ‘ఈ- లూనా’ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దీనికిముందు బజాజ్ ఆటో కూడా తన ప్రముఖ స్కూటర్ చేతక్‌ను పాత నేమ్ ప్లేట్‌తోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే ఎల్ఎంఎల్ కూడా ఇదే ఏడాది తన స్టార్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ లూనా అంటే ఈ- లూనా.. ఇది కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ వవర్ సొల్యూషన్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించనున్న తొలి మోడల్. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కంపెనీ నెలకు 5 వేల ‘ఈ లూనా’లను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కైనెటిక్ తన ఎలక్ట్రిక్ లూనా కోసం మరో అసెంబ్లీ లైన్ నెలకొల్పుతోంది. కంపెనీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఈ- లూనాలను ఉత్పత్తి చేయనుంది. కాగా కైనెటిక్ లూనా నాటి కాలంలో ఎంతో ఆదరణ పొందింది. దీనిని కైనెటిక్ ఇంజినీరింగ్ తొలిసారి 1972లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. సుమారు 50 సీసీ ఇంజను సామర్థ్యం కలిగిన ఈ వాహనం దేశంలో తొలి మోపెడ్‌గా పేరొందింది. తరువాతి కాలంలో టీఎఫ్ఆర్, డబల్ ప్లస్, వింగ్స్, మేగ్నం, సూపర్ పేర్లతో రకరకాల వేరియంట్స్‌లో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లూనాను తొలిసారి మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు దీని ధర రూ.2,000. 1972లో వచ్చిన ఒరిజినల్ లూనా పియాజియో సియావో మోపెడ్‌కు చెందిన లైసెన్స్డ్ వెర్షన్. దీని తరువాత 2000 దశకం తొలినాళ్లలో లూనా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు కైనెటిక్ తెలిపింది. -
కైనటిక్ గ్రీన్ ప్రతినిధులతో మేకపాటి భేటీ
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీఛార్జ్ యూనిట్లు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీఛార్జ్ యూనిట్ల ఏర్పాటుకు 'కైనెటిక్ గ్రీన్' వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని ముందుకొచ్చారు. విజయవాడలోని కానూరలో పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డిని బుధవారం ఆమె కలిశారు. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల మ్యాన్‌ఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపైన చర్చించారు. కార్యక్రమంలో కైనటిక్ గ్రీన్ ఎండీ రితేశ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జ్ స్టేషన్లు నెలకొల్పడంపైనా సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ పాలసీలో విద్యుత్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. పర్యావరణానికి హాని లేని విద్యుత్ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. విద్యుత్ వాహన రంగానిదే విద్వత్ అని ఆయన అభివర్ణించారు. ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అప్రూవ్ చేసిన మూడు చక్రాల విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా 'కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ'కి పేరు గడించిందని సీఈఓ సులజ్జ చెప్పారు. ఇప్పటికే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తో భాగస్వామ్యమైనట్లు మంత్రికి వివరించారు. (చదవండి: పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్) -
దూసుకొచ్చిన ‘డ్రాగ్‌స్టర్’ కొత్త బైక్స్
న్యూఢిల్లీ: మోటోరాయల్,కైనిటిక్ గ్రూప్‌ల మల్టీ–బ్రాండ్ సూపర్‌బైక్స్ వెంచర్ నుంచి అధునాతన ‘ఎంవీ అగస్టా డ్రాగ్‌స్టర్ సిరీస్’ విడుదలైంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ సూపర్‌బైక్స్ బుధవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్’, ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్ అమెరికా’ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 18.73 లక్షలు కాగా.. ‘డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్ పిరెల్లి’ ట్రిమ్ ధర రూ. 21.5 లక్షలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా మోటోరాయల్ మేనేజింగ్ డైరెక్టర్ అజిన్క్య ఫిరోడియా మాట్లాడుతూ.. ‘ఇక్కడి రహదారి పరిస్థితులకు అనుగుణంగా ఉండే, ఆకర్షణీయ కొత్త సూపర్‌బైక్స్ విడుదలచేశాం. తాజా వేరియంట్లు కూడా మునుపటి మోడళ్ల మాదిరిగా విజయవంతం అవుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు. -
వాయువుల కైనెటిక్ సిద్ధాంతం రుజువు ..
P. Vijay Kishore Senior faculty,Hyderabad Chemical bonding & Gaseous State 1. The correct order of bond angles smallest first in H2S, NH3, BF3, and SiH4 is a) H2S < SiH4 < NH3 < BF3 b) NH3 < H2S < SiH4 < BF3 c) H2S < NH3 < SiH4 < BF3 d) H2S < NH3 < BF3 < SiH4 2. The states of hybridisation of boron and oxygen atoms in boric acid (H3BO3) are respectively a) sp2 and sp2 b) sp2 and sp3 c) sp3 and sp2+ d) sp3 and sp3 3. Which one of the following has the regular tetrahedral structure? a) SF4 b) c) XeF4 d) [Ni(CN)4]2 4. The maximum number of 90° angles between bond pair-bond pair of electrons is observed in a) sp3d2 hybridisation b) sp3d hybridisation c) dsp2 hybridisation d) dsp3 hybridisation 5. The bond order in NO is 2.5 while that in NO+ is 3. Which of the following statements is true for these two species? a) Bond length in NO+ is greater than in NO b) Bond length in NO is greater than in NO+ c) Bond length in NO+ is equal to that in NO d) Bond length is unpredictable 7. Lattice energy of an ionic compound depends upon a) Charge on the ion only b) Size of the ion only c) Packing of ions only d) Charge and size of the ions 10. A metal, M forms chlorides in its +2 and +4 oxidation states. Whi-ch of the following statements about these chlorides is correct ? a) MCl2 is more volatile than MCl4 b) MCl2 is more soluble in anhydrous ethanol than MCl4 c) MCl2 is more ionic than MCl4 d) MCl2 is more easily hydrol ysed than MCl4 11. In which of the following molec-ules/ions all the bonds are not equal ? a) SF4 b) SiF4 c) XeF4 d) BF4 12. The increasing order of the first ionization enthalpies of the elem-ents B, P S and F (lowest first) is a) F < S < P < B b) P < S < B < F c) B < P < S < F d) B < S <P < F 13. The decreasing values of bond angles from NH3(106°) to SbH3 (101°) down group-15 of the periodic table is due to a) Increasing bp–bp repulsion b) Increasing p–orbital character in sp3 c) Decreasing lp–bp repulsion d) Decreasing electronegativity 16. Which of the following hydrogen bonds is the strongest ? a) O – H …N b) F – H …F c) O – H ….O d) O – H …F 17. The charge/size ratio of a cation determines its polarizing power. Which one of the following sequ-ences represents the increasing order of the polarising power of the cationic species, K+, Ca2+, Mg2+, Be2+ a) Mg2+ < Be2+ < K+ < Ca2+ b) Be2+ < K+ < Ca2+ < Mg2+ c) K+ < Ca2+ < Mg2+ < Be2+ d) Ca2+ < Mg2+ < Be2+ < K+ 18. Which one of the following pairs of species have the same bond order? a) CN– and NO+ b) CN– and CN+ c) d) NO+ and CN+ 21. Value of gas constant R is a) 0.082 litre atm b) 0.987 calmol–1K–1 c) 8.3 J mol–1 K–1 d) 83 erg mol–1 K–1 22. Kinetic theory of gases proves a) Only Boyle's law b) Only Charles' law c) Only Avogadro's law d) All of these 23. For an ideal gas, number of moles per litre in terms of its pressure P, as constant R and temperature T is a) PT/R b) PRT c) P/RT d) RT/P 24. According to the kinetic theory of gases, in an ideal gas between two successive collision a gas molecule travels a) In a circular path b) In a wavy path c) In a straight line path d) With an accelerated velocity 25. As the temperature is raised from 20°C to 40°C, the average kinetic energy of neon atoms changes by a factor of which of the following? a) 1/2 b) c) d) 2 26. In vander waals' equation of state of the gas law, the constant 'b' is a measure of a) Intermolecular repulsions b) Intermolecular attractions c) Volume occupied by the molecules d) Intermolecular collisions per unit volume 27. Which one of the following state-ments is not true about the effect of an increase in temperature on the distribution of molecular speeds in a gas? a) The area under the distribut-ion curve remains the same as under the lower temperature b) The distribution becomes broader c) The fraction of the molecules with the most probable speed increases d) The most probable speed increases 28. If 10–4 dm3 of water is introduc-ed into a 1.0 dm3 flask at 300 K, how many moles of water are in the vapour phase when equilibri-um is established? (Given: Vapour pressure of H2O at 300 K is 3170 Pa; R = 8.314 JK–1 mol–1) a) 1.27 × 10–3 mol b) 5.56 × 10–3 mol c) 1.53 × 10–2 mol d) 4.46 × Q10–2 mol 29. 'a' and 'b' are vander Waals' constants for gases. Chlorine is more easily liquefied than ethane because a) a and b for Cl2 < a and b for C2H6 b) a for Cl2 < a for C2H6 but b for Cl2 > b for C2H6 c) a for Cl2 > a for C2H6 but b for Cl2 < b for C2H6 d) a and b for Cl2 > a and b for C2H6 30. The compressibility factor for a real gas at high pressure is : a) 1 + RT/pb b) 1 c) 1 + pb/RT d) 1–pb/RT 32. Arrange the vander Waals' constant for the gases I) C6H6(g) A) 0.217 II) C6H5.CH3(g) B) 5.464 III) Ne(g) C) 18.000 IV) H2O(g) D) 24.060 a) I-A, II-D, III-C, IV-B b) I-D, II-A, III-B, IV-C c) I-C, II-D, III-A, IV-B d) I-B, II-C, III-A, IV-D 33. X mL of H2 gas effuses through a hole in a container is 5 second. The time taken for the effusion of the same volume of the gas specified below under identical conditions is a) 10 seconds : He b) 20 seconds : O2 c) 25 seconds : CO d) 55 seconds : CO2 34. The compressibility factor for an ideal gas is a) 1.5 b) 1.0 c) 2.0 d) ¥ 35. According to Graham's law, at a given temperature, the ratio of rates of diffusion rA/rB of gases A and B is given by a) (PA/PB) (MA/MB)1/2 b) (MA/MB) (PA/PB)1/2 c) (PA/PB) (MB/MA)1/2 d) (MA/MB) (PB/PA)1/2 36. A gas will approach ideal behaviour at a) Low temperature and low pressure b) Low temperature and high pressure c) High temperature and low pressure d) High temperature and high pressure 37. The compressibility of a gas is less than unity at STP. Therefore: a) Vm > 22.4 litre b) Vm < 22.4 litre c) Vm = 22.4 litre d) Vm = 44.8 litre 38. The rms velocity of hydrogen is Ö7 times the rms velocity of nitrogen. If T is the temperature of the gas, then a) T(H2) = T(N2) b) T(H2) > T(N2) c) T(H2) < T(N2) d) T(H2) = Ö7 T(N2) 39. At 100°C and 1 atm, if the dens-ity of liquid water is 1.0 g cm–3 and that of water vapour is 0.0006 g cm–3, then the volume occupied by water molecules in 1 litre of steam at that temperature is a) 6 cm3 b) 60 cm3 c) 0.6 cm3 d) 0.06 cm3 40. The root mean square speed of an ideal gas at constant pressure varies with density d as a) d2 b) d c) Öd d) Key 1) c 2) b 3) b 4) a 5) b 6) b 7) d 8) c 9) a 10) c 11) a 12) d 13) d 14) a 15) b 16) b 17) c 18) a 19) b 20) a 21) c 22) d 23) c 24) c 25) c 26) c 27) c 28) a 29) c 30) c 31) b 32) c 33) b 34) b 35) c 36) c 37) b 38) c 39) c 40) d