ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.
ఏథర్ 450ఎస్
ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.
ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్
2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.
ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్
3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).
ఏథర్ 450 అపెక్స్
ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.
ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment