ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం.. 4000 మందికి ఉద్యోగావకాశాలు Ather Energy to Invest Rs 2000 Crore in Maharashtra | Sakshi
Sakshi News home page

ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం.. 4000 మందికి ఉద్యోగావకాశాలు

Published Thu, Jun 27 2024 2:40 PM | Last Updated on Thu, Jun 27 2024 3:13 PM

Ather Energy to Invest Rs 2000 Crore in Maharashtra

బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' మహారాష్ట్రలో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం సంస్థ ఏకంగా రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.

బిడ్కిన్, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (AURIC)లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. బ్యాటరీలను కూడా తయారు చేయనున్నట్లు ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏథర్ ఎనర్జీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏటా 10లక్షల కంటే ఎక్కువ వాహనాలను, బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న కంపెనీ ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 4.3 లక్షల బ్యాటరీ ప్యాక్‌లు & 4.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు.

మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ బ్రాండ్ వాహనాలను విరివిగా ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వేగంగా డెలివరీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్ & సిటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement