IDFC First Bank Chairman Vaidyanathan Gifted Rs 4 Crore Value Shares To His Support Staff - Sakshi
Sakshi News home page

డ్రైవర్, పనిమనిషికి రూ. 4 కోట్ల నజరానా!

Published Tue, Feb 22 2022 8:27 AM | Last Updated on Tue, Feb 22 2022 12:15 PM

IDFC First Bank Chairman Vaidyanathan gifted Rs 4 Crore Valued Shares to His Driver and Homemaide - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో వి. వైద్యనాథన్‌ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. సోమవారం నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ. 3.95 కోట్లుగా ఉంటుంది. 

సొంతింటి కోసం
ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్‌ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వ్యక్తిగత ట్రెయినర్‌ రమేష్‌ రాజుకు 3 లక్షల షేర్లు, పనిమనిషి ప్రాంజల్‌ నర్వేకర్‌.. డ్రైవర్‌ అలగర్‌సామికి చెరి 2 లక్షలు, ఆఫీస్‌ సపోర్ట్‌ ఉద్యోగి దీపక్‌ పఠారే మరో పని మనిషి సంతోష్‌ జోగ్లేకు చెరి 1 లక్ష షేర్లను వైద్యనాథన్‌ బహుమతిగా ఇచ్చారు. 

గతంలో
ఆయన గతంలో కూడా వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు ఇలాగే షేర్లను బహుమానంగా ఇచ్చారు. మరోవైపు, సామాజిక సేవా కార్యకలాపాల కోసం వైద్యనాథన్‌కు చెందిన రుక్మణి సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ 2 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్‌ వివరించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement