ఎల్‌ఐసీ నుంచి క్రెడిట్‌ కార్డు.. భలే బెనిఫిట్స్‌! | IDFC FIRST Bank, LIC Cards, And Mastercard Launched Two Co-Branded Credit Cards: LIC Classic And LIC Select; Check Here Benefits - Sakshi
Sakshi News home page

LIC Credit Card: ఎల్‌ఐసీ నుంచి క్రెడిట్‌ కార్డు.. భలే బెనిఫిట్స్‌!

Published Sun, Dec 17 2023 10:01 PM | Last Updated on Sun, Dec 17 2023 10:41 PM

LIC Cards launches two credit credits these are benefits - Sakshi

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు ఇతర ఫైనాన్స్‌ సంస్థలు సైతం క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఎన్నింటినో అందిస్తోంది.

ఎల్‌ఐసీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్‌ కార్డులను ప్రారంభించాయి. ఎల్‌ఐసీ క్లాసిక్‌, ఎల్‌ఐసీ సెలక్ట్‌ పేరుతో రెండు క్రెడిట్‌ కార్డులు లాంచ్‌ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. వీటి ద్వారా బీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్‌ పాయింట్లను పొందవచ్చు. రూ. 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా ఎల్‌ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది.

బెనిఫిట్స్‌లో కొన్ని..

  • ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు.
  • 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్‌ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
  • ఈ క్రెడిట్‌ కార్డుతో తొలి ఈఎమ్‌ఐపైన 5 శాతం క్యాష్‌బ్యాక్‌. 
  • రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్‌ఈజీ ప్లస్‌ మెంబర్‌ షిప్‌. 
  • ట్రావెల్‌లో డొమెస్టిక్‌ ఫైట్‌లను బుక్‌ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్‌.
  • లెన్స్‌కార్ట్‌ గోల్డ్‌ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు.
  • భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం రాయితీ.
  • ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా
  • ఎల్‌ఐసీ సెలక్ట్‌ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు. 
  • ప్రతి మూడు నెలలకు రెండుసార్లు కాంప్లమెంటరీ డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌.
  • ఎల్‌ఐసీ సెలక్ట్‌ క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల ప్రమాద బీమా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement