ముంబై: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది.
స్థూల ఎన్‌పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్‌పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్‌ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment