న్యూఢిల్లీ: టైర్ల రంగంలో అగ్రగామి సంస్థ ఎంఆర్‌ఎఫ్ జూన్‌తో అంతమైన మూడు నెలల కాలంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు దూసుకుపోయింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.6,440 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.123 కోట్లు, ఆదాయం రూ.5,696 కోట్ల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరుకుల వ్యయాలు తగ్గడం కలిసొచి్చంది.
ముడి సరుకులపై చేసిన వ్యయాలు రూ.3,781 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ముడి సరుకుల కోసం అయిన వ్యయాలు రూ.4,114 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.5,567 కోట్ల నుంచి రూ.5,728 కోట్లకు పెరిగాయి. ఎండీగా ఉన్న కేఎం మామెన్‌ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా 2024 ఫిబ్రవరి 8 నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తూ కంపెనీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. విమలా అబ్రహాంను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రెండో విడత మరో ఐదేళ్ల కాలానికి నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment