న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది.
ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్‌లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment