
ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రారంభం
ముంబై: దేశీయంగా 91వ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా ఐడీఎఫ్‌సీ బ్యాంకు గురువారం కార్యకలాపాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో 15 బ్రాం చీలు సహా మొత్తం 23 శాఖలతో బ్యాంకు సేవలు మొదలయ్యాయి. కార్పొరేట్, హోల్‌సేల్ బ్యాంకిం గ్‌తో పాటు గ్రామీణ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకులో 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్, కార్పొరేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందించే ఏడు శాఖలు ఉన్నట్లు బ్యాంకు వెబ్‌సైట్‌లో పేర్కొంది.
దీని ప్రకారం రూ. 1 కోటి పైబడిన సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతంగా, ఏడాది కాలవ్యవధి గల డిపాజిట్లపై రేటు 8 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం అధికంగా లభిస్తుంది. పర్సనల్ బ్యాంకింగ్‌కు సంబంధించి ఏ ఏటీఎంలలోనైనా లావాదేవీలు, ఫండ్ ట్రాన్స్‌ఫర్లు, లైఫ్‌టైమ్ డెబిట్ కార్డులు ఉచితంగా అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. చెక్కుకు బౌన్సులకు తప్ప ఇతరత్రా ఏ లావాదేవీకి చార్జీలు విధించబోవడం లేదని వివరించింది. బంధన్, ఐడీఎఫ్‌సీలు కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సులు పొందిన సంగతి తెలిసిందే. బంధన్ ఇప్పటికే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.
ఐడీఎఫ్‌సీ 13 శాతం డౌన్: మౌలిక రంగ రుణ సంస్థ ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ కంపెనీగా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌గా విడిపోయిన తర్వాత దాదాపు 13 శాతం క్షీణించింది. ఈ డీ మెర్జర్‌ను పరిగణనలోకి తీసుకోకుంటే బుధవారం నాటి ముగింపు ధర(రూ.141)తో పోల్చితే ఈ షేర్ 57 శాతం నష్టపోయినట్లయింది. డీ మెర్జర్ ప్రణాళిక ప్రకారం ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతుంది. బీఎస్‌ఈలో రూ.69 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన ఐడీఎఫ్‌సీ షేర్ చివరకు 13 శాతం (ప్రారంభ ధరను పరిగణనలోకి తీసుకుంటే) నష్టంతో రూ.60 వద్ద ముగిసింది. ఒక్కో ఐడీఎఫ్‌సీ షేర్‌కు, ఒక ఐడీఎఫ్‌సీ, ఒక ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. ఈ డీమెర్జర్ స్కీమ్‌కు ఈ నెల 5ను రికార్డ్ తేదీగా కంపెనీ నిర్ణయించింది.