ఖైరతాబాద్/గచ్చిబౌలి: ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఫుల్ మారథాన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. దాదాపు 9 వేల మంది పాల్గొన్న ఈ మారథాన్ దేశంలోనే రెండవ అతిపెద్దదిగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అనంతరం హాఫ్ మారథాన్‌ను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 3240 మంది పాల్గొన్నారు. ఆ తరువాత 5కె ఫన్ రన్ ప్రారంభమైంది. ఈ రన్‌లో 5వేల మంది పాల్గొన్నారు.
ఫుల్ మారథాన్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ప్లై ఓవర్, రాజ్‌భవన్, పంజగుట్ట ప్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్‌నెం–2, కెబిఆర్ పార్క్, జూబ్లిహిల్స్ రోడ్‌నెం 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, భయో డైవర్సిటీ జంక్షన్, త్రిబుల్ ఐటి జంక్షన్, జిఎంసి బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు. హాఫ్ మారథాన్‌లో పీపుల్స్ ప్లాజా నుంచి నేరుగా ఖైరతాబాద్ ప్లై ఓవర్ నుంచి ఫుల్ మారథాన్ రూట్‌లోనే జిఎంసి బాలయోగి స్టేడియానికి చేరుకున్నారు.
ఉత్సాహంగా సాగిన మారథాన్‌లో రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియో తదితరులు పాల్గొన్నారు. విజేతలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బహుమతులు అందజేశారు. ఎన్‌ఎండీసీ చైర్మెన్, ఎండి సుమిత్ దేబ్, శాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండి, సీఈఓ వైద్యనాథన్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment