hyderabad marathon
-
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 5K రన్ (ఫొటోలు)
-
ఉరకలేసిన ఉత్సాహం.. మారథాన్‌తో సరికొత్త జోష్
ఖైరతాబాద్/గచ్చిబౌలి: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఫుల్ మారథాన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. దాదాపు 9 వేల మంది పాల్గొన్న ఈ మారథాన్ దేశంలోనే రెండవ అతిపెద్దదిగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అనంతరం హాఫ్ మారథాన్‌ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 3240 మంది పాల్గొన్నారు. ఆ తరువాత 5కె ఫన్ రన్ ప్రారంభమైంది. ఈ రన్లో 5వేల మంది పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ప్లై ఓవర్, రాజ్‌భవన్, పంజగుట్ట ప్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్‌నెం–2, కెబిఆర్ పార్క్, జూబ్లిహిల్స్ రోడ్‌నెం 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, భయో డైవర్సిటీ జంక్షన్, త్రిబుల్ ఐటి జంక్షన్, జిఎంసి బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు. హాఫ్ మారథాన్‌లో పీపుల్స్ ప్లాజా నుంచి నేరుగా ఖైరతాబాద్ ప్లై ఓవర్ నుంచి ఫుల్ మారథాన్ రూట్లోనే జిఎంసి బాలయోగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్సాహంగా సాగిన మారథాన్‌లో రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియో తదితరులు పాల్గొన్నారు. విజేతలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బహుమతులు అందజేశారు. ఎన్ఎండీసీ చైర్మెన్, ఎండి సుమిత్ దేబ్, శాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండి, సీఈఓ వైద్యనాథన్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఆగస్ట్‌లో హైదరాబాద్ మారథాన్, టైటిల్ స్పాన్సర్‌గా ఎన్ఎండీసీ!
తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్ 21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. ఇక ఈ హైదరాబాద్ మారథాన్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను ఎన్ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మారథాన్ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఫేస్ ఆఫ్ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చారు. -
సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే..
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే రన్నింగ్ మారథాన్లు కేవలం క్రీడాకారులకే కాదు, పరుగంటే ఆసక్తి ఉన్నవారందరికీ పండుగ లాంటివి. ఆరోగ్యం కోసం ప్రారంభించిన పరుగు నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా ఎవరెస్టును అధిరోహించారు రొమెల్ బర్త్వాల్. మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్ ‘నేను ఢిల్లీ వాసినైనా..హైదరాబాద్ అంటే ఇష్టం. నా మారథాన్ విజయాలకు ఇక్కడే బీజం పడింది. మొదట హైదరాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటి రోజునుంచే ఈ క్లబ్ వాళ్లు రిసీవ్ చేసుకున్న తీరు, వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం ఎక్సలెంట్. నేను మొదటిసారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లో పాల్గొన్నాను. అలా నా పరుగుల పరంపర మొదలైంది. చివరకు ఎవరెస్ట్ కూడా అధిరోహించాను. ఈ విజయాలకు నాంది హైదరాబాద్ కావడం నా అదృష్టం.’ అంటూ తన విజయగాథను వివరించారు ప్రముఖ మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్. సాక్షి, హైదరాబాద్: రొమెల్ బర్త్వాల్ ఢిల్లీవాసి. ఉద్యోగం రీత్యా ప్రభుత్వ అధికారి. ఎన్నో మారథాన్లలో పాల్గొన్నారు. వీటి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ఏడాది మేలో ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. బోస్టన్ మారథాన్, లేహ్ 111 కి.మీ. లాల్ట్రా 14 గంటల రికార్డును ఆయన నెలకొల్పారు. ఢిల్లీ స్టేడియంలో 24 గంటల పరుగు పోటీలో పాల్గొని 185 కి.మీలు పరిగెత్తి రెండో స్థానంలో నిలిచాడు. వీటితో పాటు వాటర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, పారాగ్లైడింగ్, పారామోటార్స్ వంటి మరెన్నో సాహసయాత్రలు, రికార్డులు ఆయన సొంతం. ఏడవది ఈజ్ నాట్ ఈజీ.. రొమిల్ బర్త్వాల్ ఏడు పర్వతాలను అధిరోహించారు. అందులో ఏడవది మౌంట్ ఎవరెస్ట్. ఎటువంటి గాయాలు లేకుండా ఎవరెస్టు యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన రికార్డుని రొమిల్ టీం సొంతం చేసుకుంది. ఏడాది పాటు కఠిన శిక్షణతోనే ఇది సాధ్యమైంని చెబుతారు రొమిల్. సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. అనేక రికార్డులు సొంతం చేసుకున్న రొమెల్ సాహస యాత్ర హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇక్కడ ఐఐటీలో చదివేప్పుడు మారథాన్లపై ఆసక్తిని పెంచుకున్నా రు. ‘‘2012లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నా కల నిజమయ్యే అవకాశం కలిగింది. ఈ సిటీ నా ఫేవరెట్. హైదారాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటిరోజు నుంచే ఈ క్లబ్ రిసీవ్ చేసుకున్న తీరు వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం, చాలా మరిచిపోలేను’’ అని భావోద్వేగాని గురయ్యారు. పరుగు.. ఒక వ్యసనం మొదటి సారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లలో పాల్గొన్నాను. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు ప్రతి రోజూ చూసేవాడిని. అంతగా ఈ పరుగులలో పాల్గొనడానికి అడిక్ట్ అయిపోయాను. హైదరాబాద్ హెరిటేజ్ వాక్, హాఫ్ మారథాన్ (21 కి.మీ)కి ముందు చెయ్యగలనా లేదా అని సంశయించాను. కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. అలా ప్రారంభమైన పరుగుల పరంపర ఒక వ్యసనంలా మారింది ఎవరెస్ట్ అధిరోహణ అసాధ్యమేమీ కాదు.. ఉద్యోగం, చదువు పేరుతో బిజీగా ఉన్న వాళ్లు ఒక్క రోజులో ఫుల్ మారథాన్ పరిగెత్తడం, ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా సాధించగలరు. 2 కి.మీ. నడక నుంచి ప్రారంభించి, 5, 10 కి.మీ. పరుగుకు చేరుకోవచ్చు. 5 కి.మీలు నటక, పరుగు నుంచి ప్రారంభించటం వల్ల శారీరక స్థితి మెరుగవుతుంది. తర్వాత చిన్న చిన్న ట్రెక్కింగ్‌ను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత తక్కువ ఎత్తున్న పర్వతాలను ఎక్కుతూ, ఎవరెస్ట్ అధిరోహణ శిక్షణ తీసుకోవడానికి సిద్ధం కావచ్చు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్‌ను మరువలేను 2012 నుంచి క్లబ్లో మెంబర్‌గా ఉన్నాను. ఇక్కడి మారథాన్లలో నాలుగు సార్లు పాల్గొన్నాను. నేను పాల్గొన్న క్లబ్లన్నింటి కంటే హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా దేశాల్లో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు ఉన్నారు. వీరు చాలా ఈవెంట్ల గురించి వివరాలు తెలియజేస్తారు. సలహాలిస్తారు. ఇక వేరే నగరాల్లో ఇలాంటి గ్రూప్‌లు ఏర్పాటు అయి కొంతకాలానికి కనుమరుగవుతుంటాయి. ఈ గ్రూప్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. డిసిప్లిన్, హెల్ప్ఫుల్నెస్ హైదరాబాద్‌లో చాలా బాగుంటుంది. 2015లో నగరం వదిలినా ఈ క్లబ్‌ని, ఇక్కడి మిత్రులను కలవడం మాత్రం మానలేదు. -
మారథాన్ మానియా
-
గ్రాండ్ మారథాన్
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ సూపర్ సక్సెస్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పరుగుల పోటీలు ఫుల్ మారథాన్ విజేతలు ఇంద్రజీత్యాదవ్.. జ్యోతి గవాటే సాక్షి, హైదరాబాద్: మారథాన్.. మారథాన్.. మారథాన్.. ఆదివారం భాగ్యనగరం మారథాన్ మేనియాతో ఊగిపోయింది. ఒకవైపు చిరుజల్లులు.. మరోవైపు యువతీయువకులు, చిన్నారుల కేరింతలతో ఎయిర్టెల్ మారథాన్ ఏడో ఎడిషన్ ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఫుల్ మారథాన్(42.2 కి.మీ.), హాఫ్ మారథాన్(21.1 కి.మీ.), 10కె రన్ పేరిట మూడు ఈవెంట్లుగా నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు 16 వేల మంది రన్నర్లు పాలుపం చుకున్నారు. ప్రొఫెషనల్ రన్నర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా హైదరాబాదీలు పెద్ద సం ఖ్యలో రన్లో పాల్గొన్నారు. మొత్తంగా రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం నిర్వహిం చిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ రన్ విజయవంతమైంది. నెక్లెస్రోడ ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి జెండా ఊపి ఫుల్ మారథాన్‌ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా వద్దే ఉదయం ఆరు గంటలకు హాఫ్ మారథాన్ ప్రారంభమైంది. హైటెక్స్ ఎక్స్పో గ్రౌండ్ వద్ద ఉదయం 7 గంటలకు 10కె రన్‌ను సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. మార థాన్‌లో గెలుపొందిన స్త్రీ, పురుషులకు మూడు విభాగాల్లో మొత్తంగా రూ.7.2 లక్షల ప్రైజ్‌మనీని అందజేశారు. కార్యక్రమంలో ఎయిర్టెల్ సీఈవో ఎం.వెంకటేశ్ విజయ రాఘవ న్, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజీత్ మధ్నూకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహణకు ప్రణాళికలు రూపొం దిస్తామని నిర్వాహకులు తెలిపారు. మారథాన్ విజేతలు వీరే.. 42.2 కి.మీ. పుల్ మారథాన్ పురుషుల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్ యాదవ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంద్రజీత్ రెండు గంటల 31 నిమిషాల తొమ్మిది సెకన్లలో రేస్ పూర్తి చేశాడు. కడప జిల్లా చెన్నుపల్లి గ్రామానికి చెందిన దాసరి ఓబులేశ్ రెండు గంటల 34 నిమిషాల ఎనిమిది సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. బీఏ మూడో సంవత్సరం విద్యార్థి పి.క్రెస్టార్జునే మూడోస్థానం సాధించాడు. హాఫ్ మారథాన్‌లో యూపీకే చెందిన సమ్రూ యాదవ్.. 10కె రన్లో షన్షర్లాంగ్ వాలంగ్ విజేతలుగా నిలిచారు. మహిళా విజేతలు వీరే... మహిళల విభాగం పుల్‌మారథాన్‌లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గవాటే మొదటి స్థానంలో నిలిచారు. 3 గంటల ఎనిమిది నిమిషాల రెండు సెకన్లలో ఆమె గమ్యం చేరుకున్నారు. యూపీకి చెందిన జ్యోతిసింగ్ రెండో స్థానంలో, అలహాబాద్‌కు చెందిన ఆరాధనా పూల్‌చంద్ మూడో స్థానంలో నిలిచారు. హాఫ్ మారథాన్‌లో అమందీప్ కౌర్.. 10కె రన్లో వి.నవ్య విజేతలుగా నిలిచారు. ఫుల్ మారథాన్‌లో 1,000 మంది, హాఫ్ మారథాన్‌లో 5 వేల మంది, 10కె రన్లో 6,500 మంది రన్న ర్స్‌గా నిలిచారు. -
హైదరాబాద్ మారథాన్
-
హైదారాబాద్ లో రేపు ట్రాఫిక్ మళ్లింపు
హైదారాబాద్ : హైదరాబాద్‌లోని రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీ(ఆదివారం) జరగనన్న 10 కే రన్ మారథాన్ కు పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రన్ వెళ్లే మార్గాల్లో తెల్లవారు జాము 4.30 గంటల నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు: - నెక్లెస్ రోడ్ రెండు మార్గాలలో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు లోయర్ ట్యాంక్ బండ్ లో వెళ్లాలి. - సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు చింతల్ బస్తీ నుంచి వెళ్లాలి. - ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు మింట్ కాంపౌండ్ వెళ్లాలి. - లిబర్టీ నుంచి సికింద్రాబాద్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. - గ్రీన్ ల్యాండ్స్ నుంచి ఖైరతాబాద్ వరకు ఉదయం 5 గంటల నుంచి 7 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు అమీర్ పేట, పంజాగుట్ట మీదుగా వెళ్లాలి. - బేగంపేట నుంచి బంజారాహిల్స్( పంజాగట్ట ఫ్లై ఓవర్ మీదుగా) ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు అమీర్ పేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి. - నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఉదయం 5.30 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు రోడ్ నెం-1,10 లేదా పంజాగుట్ట వైపు వెళ్లాలి. - క్యాన్సర్ హాస్పిటల్, శ్రీనగర్ కాలనీ నుంచి చెక్ పోస్టు వరకు ఉదయం 5.30 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో రోడ్ నెం- 45 లేదా పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ను ఎంచుకోవాలి. - చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వైపు ఉదయం 5.30 గంటల నుంచి 7.45 వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెం- 45 లేదా అయ్యప్ప సొసైటీ ను ఎంచుకోవాలి. -కృష్ణా నగర్ నుంచి అపోలో హాస్పిటల్, మాదాపూర్ వైపు ఉదయం 5.30 నుంచి 7.30 వరకు. - జూబ్లీహిల్స్ టూ సైబర్ టవర్స్ వైపు ఉదయం 5.30 గంటల నుంచి 7.45 వరకు. ఈ మార్గంలోని ట్రాఫిక్ ను ఇనార్బిట్ మాల్ లేదా అయ్యప్ప సొసైటీ వైపు మళ్లిస్తారు. -హైటెక్స్ టూ కూకట్ పల్లి వైపు ఉదయం 7.15 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా గబ్బిబౌలి ఫ్లై ఓవర్ రెండు మార్గాలను ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మూసివేస్తారు.