హైదారాబాద్ లో రేపు ట్రాఫిక్ మళ్లింపు | Traffic diversion for marathon | Sakshi
Sakshi News home page

హైదారాబాద్ లో రేపు ట్రాఫిక్ మళ్లింపు

Published Sat, Aug 27 2016 2:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

Traffic diversion for marathon

హైదారాబాద్ : హైదరాబాద్‌లోని రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీ(ఆదివారం) జరగనన్న 10 కే రన్ మారథాన్ కు పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రన్ వెళ్లే మార్గాల్లో తెల్లవారు జాము 4.30 గంటల నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. 
 
ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు:
- నెక్లెస్ రోడ్ రెండు మార్గాలలో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు లోయర్ ట్యాంక్ బండ్ లో వెళ్లాలి.
- సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు చింతల్ బస్తీ నుంచి వెళ్లాలి.
- ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. ఈ మార్గంలో వెళ్లే వారు మింట్ కాంపౌండ్ వెళ్లాలి.
- లిబర్టీ నుంచి సికింద్రాబాద్ వరకు తెల్లవారుజాము 4.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. 
- గ్రీన్ ల్యాండ్స్ నుంచి ఖైరతాబాద్ వరకు ఉదయం 5 గంటల నుంచి 7 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు అమీర్ పేట, పంజాగుట్ట మీదుగా వెళ్లాలి.
- బేగంపేట నుంచి బంజారాహిల్స్( పంజాగట్ట ఫ్లై ఓవర్ మీదుగా) ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు అమీర్ పేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
- నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఉదయం 5.30 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో వెళ్లే వారు రోడ్ నెం-1,10 లేదా పంజాగుట్ట వైపు వెళ్లాలి.
- క్యాన్సర్ హాస్పిటల్, శ్రీనగర్ కాలనీ నుంచి చెక్ పోస్టు వరకు ఉదయం 5.30 గంటల నుంచి 7.30 వరకు. ఈ మార్గాల్లో రోడ్ నెం- 45 లేదా పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ను ఎంచుకోవాలి.
- చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వైపు ఉదయం 5.30 గంటల నుంచి 7.45 వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెం- 45 లేదా అయ్యప్ప సొసైటీ ను ఎంచుకోవాలి.
-కృష్ణా నగర్ నుంచి అపోలో హాస్పిటల్, మాదాపూర్ వైపు ఉదయం 5.30 నుంచి 7.30 వరకు. 
- జూబ్లీహిల్స్ టూ సైబర్ టవర్స్ వైపు ఉదయం 5.30 గంటల నుంచి 7.45 వరకు. ఈ మార్గంలోని ట్రాఫిక్ ను ఇనార్బిట్ మాల్ లేదా అయ్యప్ప సొసైటీ వైపు మళ్లిస్తారు.
-హైటెక్స్ టూ కూకట్ పల్లి వైపు ఉదయం 7.15 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా గబ్బిబౌలి ఫ్లై ఓవర్ రెండు మార్గాలను ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మూసివేస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement