సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే..  | Romil Barthwal Talk About Hyderabad Marathon | Sakshi
Sakshi News home page

సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. 

Published Sun, Aug 25 2019 9:15 AM | Last Updated on Sun, Aug 25 2019 9:16 AM

Romil Barthwal Talk About Hyderabad Marathon - Sakshi

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే రన్నింగ్‌ మారథాన్లు కేవలం క్రీడాకారులకే కాదు, పరుగంటే ఆసక్తి ఉన్నవారందరికీ పండుగ లాంటివి. ఆరోగ్యం కోసం ప్రారంభించిన పరుగు నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా ఎవరెస్టును అధిరోహించారు రొమెల్‌ బర్త్‌వాల్‌.

 మారథాన్‌ రన్నర్‌ రోమిల్‌ బర్త్‌వాల్‌ ‘నేను ఢిల్లీ వాసినైనా..హైదరాబాద్‌ అంటే ఇష్టం. నా మారథాన్‌ విజయాలకు ఇక్కడే బీజం పడింది. మొదట హైదరాబాద్‌ రన్నర్‌ క్లబ్‌లో చేరాను. చేరిన మొదటి రోజునుంచే ఈ క్లబ్‌ వాళ్లు రిసీవ్‌ చేసుకున్న తీరు, వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం ఎక్సలెంట్‌. నేను మొదటిసారి పీపుల్స్‌ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్‌లో పాల్గొన్నాను. అలా  నా పరుగుల పరంపర మొదలైంది. చివరకు ఎవరెస్ట్‌ కూడా అధిరోహించాను. ఈ విజయాలకు నాంది హైదరాబాద్‌ కావడం నా అదృష్టం.’ అంటూ తన విజయగాథను వివరించారు ప్రముఖ మారథాన్‌ రన్నర్‌ రోమిల్‌ బర్త్‌వాల్‌.

సాక్షి, హైదరాబాద్‌: రొమెల్‌ బర్త్‌వాల్‌ ఢిల్లీవాసి.  ఉద్యోగం రీత్యా ప్రభుత్వ అధికారి. ఎన్నో మారథాన్లలో పాల్గొన్నారు. వీటి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ఏడాది మేలో ఎవరెస్ట్‌ శిఖరాన్ని  విజయవంతంగా అధిరోహించారు. బోస్టన్‌ మారథాన్, లేహ్‌ 111 కి.మీ. లాల్‌ట్రా 14 గంటల రికార్డును ఆయన నెలకొల్పారు.  ఢిల్లీ స్టేడియంలో 24 గంటల పరుగు పోటీలో పాల్గొని 185 కి.మీలు పరిగెత్తి రెండో స్థానంలో నిలిచాడు. వీటితో పాటు వాటర్‌ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, పారాగ్‌లైడింగ్, పారామోటార్స్‌ వంటి మరెన్నో సాహసయాత్రలు, రికార్డులు ఆయన సొంతం.

ఏడవది ఈజ్‌ నాట్‌ ఈజీ.. 
రొమిల్‌ బర్త్‌వాల్‌ ఏడు పర్వతాలను అధిరోహించారు. అందులో ఏడవది మౌంట్‌ ఎవరెస్ట్‌. ఎటువంటి గాయాలు లేకుండా ఎవరెస్టు యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన రికార్డుని రొమిల్‌ టీం సొంతం చేసుకుంది. ఏడాది పాటు కఠిన శిక్షణతోనే ఇది సాధ్యమైంని చెబుతారు రొమిల్‌.

సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. 
అనేక రికార్డులు సొంతం చేసుకున్న రొమెల్‌ సాహస యాత్ర హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇక్కడ ఐఐటీలో చదివేప్పుడు మారథాన్లపై ఆసక్తిని పెంచుకున్నా రు. ‘‘2012లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నా కల నిజమయ్యే అవకాశం కలిగింది. ఈ సిటీ నా ఫేవరెట్‌. హైదారాబాద్‌ రన్నర్‌ క్లబ్‌లో చేరాను. చేరిన మొదటిరోజు నుంచే ఈ క్లబ్‌ రిసీవ్‌ చేసుకున్న తీరు వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం, చాలా మరిచిపోలేను’’ అని భావోద్వేగాని గురయ్యారు. 

పరుగు.. ఒక వ్యసనం 
మొదటి సారి పీపుల్స్‌ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్‌లలో పాల్గొన్నాను.  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు ప్రతి రోజూ చూసేవాడిని. అంతగా ఈ పరుగులలో పాల్గొనడానికి అడిక్ట్‌ అయిపోయాను. హైదరాబాద్‌ హెరిటేజ్‌ వాక్, హాఫ్‌ మారథాన్‌ (21 కి.మీ)కి ముందు చెయ్యగలనా లేదా అని సంశయించాను. కానీ ఇక్కడ ఆర్గనైజర్స్‌ నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అలా ప్రారంభమైన పరుగుల పరంపర ఒక వ్యసనంలా మారింది

ఎవరెస్ట్‌ అధిరోహణ అసాధ్యమేమీ కాదు.. 
ఉద్యోగం, చదువు పేరుతో బిజీగా ఉన్న వాళ్లు ఒక్క రోజులో ఫుల్‌ మారథాన్‌ పరిగెత్తడం, ఎవరెస్ట్‌ ఎక్కడం కుదరదు. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా సాధించగలరు. 2 కి.మీ. నడక నుంచి ప్రారంభించి, 5, 10 కి.మీ. పరుగుకు చేరుకోవచ్చు. 5 కి.మీలు నటక, పరుగు నుంచి ప్రారంభించటం వల్ల శారీరక స్థితి మెరుగవుతుంది. తర్వాత చిన్న చిన్న ట్రెక్కింగ్‌ను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత తక్కువ ఎత్తున్న పర్వతాలను ఎక్కుతూ, ఎవరెస్ట్‌ అధిరోహణ శిక్షణ తీసుకోవడానికి సిద్ధం కావచ్చు.

హైదరాబాద్‌ రన్నర్స్‌ క్లబ్‌ను మరువలేను 
2012 నుంచి క్లబ్‌లో మెంబర్‌గా ఉన్నాను. ఇక్కడి మారథాన్‌లలో నాలుగు సార్లు పాల్గొన్నాను. నేను పాల్గొన్న క్లబ్‌లన్నింటి కంటే హైదరాబాద్‌ రన్నర్స్‌ క్లబ్‌ చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా దేశాల్లో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు ఉన్నారు. వీరు చాలా ఈవెంట్ల గురించి వివరాలు తెలియజేస్తారు. సలహాలిస్తారు. ఇక వేరే నగరాల్లో ఇలాంటి గ్రూప్‌లు ఏర్పాటు అయి కొంతకాలానికి కనుమరుగవుతుంటాయి. ఈ గ్రూప్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. డిసిప్లిన్, హెల్ప్‌ఫుల్‌నెస్‌ హైదరాబాద్‌లో చాలా బాగుంటుంది. 2015లో నగరం వదిలినా ఈ క్లబ్‌ని, ఇక్కడి మిత్రులను కలవడం మాత్రం మానలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement