గ్రాండ్ మారథాన్
- ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ సూపర్ సక్సెస్
- ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పరుగుల పోటీలు
- ఫుల్ మారథాన్ విజేతలు ఇంద్రజీత్‌యాదవ్.. జ్యోతి గవాటే
సాక్షి, హైదరాబాద్: మారథాన్.. మారథాన్.. మారథాన్.. ఆదివారం భాగ్యనగరం మారథాన్ మేనియాతో ఊగిపోయింది. ఒకవైపు చిరుజల్లులు.. మరోవైపు యువతీయువకులు, చిన్నారుల కేరింతలతో ఎయిర్‌టెల్ మారథాన్ ఏడో ఎడిషన్ ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఫుల్ మారథాన్(42.2 కి.మీ.), హాఫ్ మారథాన్(21.1 కి.మీ.), 10కె రన్ పేరిట మూడు ఈవెంట్లుగా నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు 16 వేల మంది రన్నర్లు పాలుపం చుకున్నారు.
ప్రొఫెషనల్ రన్నర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా హైదరాబాదీలు పెద్ద సం ఖ్యలో రన్‌లో పాల్గొన్నారు. మొత్తంగా రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం నిర్వహిం చిన ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ రన్ విజయవంతమైంది. నెక్లెస్‌రోడ ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి జెండా ఊపి ఫుల్ మారథాన్‌ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా వద్దే ఉదయం ఆరు గంటలకు హాఫ్ మారథాన్ ప్రారంభమైంది.
హైటెక్స్ ఎక్స్‌పో గ్రౌండ్ వద్ద ఉదయం 7 గంటలకు 10కె రన్‌ను సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. మార థాన్‌లో గెలుపొందిన స్త్రీ, పురుషులకు మూడు విభాగాల్లో మొత్తంగా రూ.7.2 లక్షల ప్రైజ్‌మనీని అందజేశారు. కార్యక్రమంలో ఎయిర్‌టెల్ సీఈవో ఎం.వెంకటేశ్ విజయ రాఘవ న్, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజీత్ మధ్నూకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహణకు ప్రణాళికలు రూపొం దిస్తామని నిర్వాహకులు తెలిపారు.
మారథాన్ విజేతలు వీరే..
42.2 కి.మీ. పుల్ మారథాన్ పురుషుల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్ యాదవ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంద్రజీత్ రెండు గంటల 31 నిమిషాల తొమ్మిది సెకన్లలో రేస్ పూర్తి చేశాడు. కడప జిల్లా చెన్నుపల్లి గ్రామానికి చెందిన దాసరి ఓబులేశ్ రెండు గంటల 34 నిమిషాల ఎనిమిది సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. బీఏ మూడో సంవత్సరం విద్యార్థి పి.క్రెస్‌టార్జునే మూడోస్థానం సాధించాడు. హాఫ్ మారథాన్‌లో యూపీకే చెందిన సమ్రూ యాదవ్.. 10కె రన్‌లో షన్‌షర్‌లాంగ్ వాలంగ్ విజేతలుగా నిలిచారు.
మహిళా విజేతలు వీరే...
మహిళల విభాగం పుల్‌మారథాన్‌లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గవాటే మొదటి స్థానంలో నిలిచారు. 3 గంటల ఎనిమిది నిమిషాల రెండు సెకన్లలో ఆమె గమ్యం చేరుకున్నారు. యూపీకి చెందిన జ్యోతిసింగ్ రెండో స్థానంలో, అలహాబాద్‌కు చెందిన ఆరాధనా పూల్‌చంద్ మూడో స్థానంలో నిలిచారు. హాఫ్ మారథాన్‌లో అమందీప్ కౌర్.. 10కె రన్‌లో వి.నవ్య విజేతలుగా నిలిచారు. ఫుల్ మారథాన్‌లో 1,000 మంది, హాఫ్ మారథాన్‌లో 5 వేల మంది, 10కె రన్‌లో 6,500 మంది రన్న ర్స్‌గా నిలిచారు.