సాక్షి, ముంబై: ఐడీఎఫ్‌సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్‌సీ సంస‍్థలు శనివారం ధృవీకరించాయి. ఈ వీలీనం ద్వారా ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పడనున్నట్టు వెల్లడించాయి. వీటి ఆమోదానికి సంబంధించిన అన్నిఅనుమతులను పొందిన తరువాత సుమారు 64లక్షల మంది వినియోగదారులు రూ. 1.4కోట్ల ఆస్తులతో ఈ జాయింట్ సంస్థ ఆవిర్భవిస్తుంది.
మరోవైపు ఈ కంపెనీకి బిపిల్ జెమానీ మధ్యంతర సీఈవోగా ఉండనున్న నేపథ్యంలో తక్షణమే ఆయన ఐడీఎఫ్‌సీ సీఎఫ్‌వో పదవికి రిజైన్ చేశారు. అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఫౌండర్ వైద్య నాథన్ కొత్త సంస్థకు ఎండీ, సీఈవోగాను, ఐడీఎఫ్‌సీకు చెందిన రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు గాను, ఐడీఎఫ్‌సీ 139 షేర్లు దక్కనున్నాయి. కొత్త ఇటీవల శ్రీరామ్ సిటీ యూనియన్‌తో విలీనాన్ని రద్దు చేసుకున్న ఐడీఎఫ్‌సీ ఇదే విధంగా క్యాపిటల్ ఫస్ట్‌తో విలీనాన్ని కూడా రద్దు చేసుకోనుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అధికారిక ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment