BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు! | IDFC First Bank Wins BCCI Title Sponsorship Rights For Matches Of Next Three Years - Sakshi
Sakshi News home page

IDFC First Wins BCCI Title Rights: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు!

Published Sat, Aug 26 2023 2:38 AM | Last Updated on Sat, Aug 26 2023 8:48 AM

IDFC First Bank holds BCCI title sponsorship rights - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖాతాలో కొత్త టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ద్వారా వచ్చే మూడేళ్లలో రూ. 235 కోట్లు చేరనున్నాయి. ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ అయిన ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌’ బోర్డు మ్యాచ్‌ల టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు సొంతం చేసుకుంది. బీసీసీఐ నిర్వహించబోయే అంతర్జాతీయ (సీనియర్‌ పురుషుల, మహిళల) మ్యాచ్‌లతో పాటు దేశవాళీ టోర్నీలు, అండర్‌–19, అండర్‌–23 టోర్నీలకు ఈ హక్కులు వర్తిస్తాయి.

కొత్త ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్‌సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లిస్తుంది. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మొదలయ్యే ఒప్పందం 2026 ఆగస్టు వరకు అమల్లో ఉంటుంది. తాజా ఒప్పందానికి ముందు వరకు ‘మాస్టర్‌ కార్డ్‌’ ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల 80 లక్షలు చెల్లించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement