ముంబై : ఇటీవలే టెలికాం కంపెనీలు ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మెగా విలీనం కూడా రద్దయింది. అది ఐడీఎఫ్‌సీ బ్యాంకు, శ్రీరామ్ క్యాపిటల్ విలీనం. నాలుగు నెలల చర్చల అనంతరం కూడా ఇరు వైపుల నుంచి వాల్యుయేషన్ పరంగా ఆమోదయోగ్యంగా లేరని ఈ విషయం తెలిసిన ముగ్గురు అధికారులు చెప్పారు. ఈ విలీన చర్చలు రద్దయినట్టు త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. వాటాదారుల సంతోషంగా లేరు. రెగ్యులేటరీ సంతోషంగా లేదు. ఈ సమయంలో ఎలాంటి మంచి జరుగదు అని ఓ వ్యక్తి చెప్పారు. ఇది చాలా కిష్టమైన డీల్ అని, నిరాశలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు మైనార్టీ వాటాదారులు ఈ చర్చ ప్రక్రియలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
జూలై తొలివారం నుంచి ఇరు కంపెనీలు ఎక్స్‌క్లూజివ్‌గా చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు విలీనమైన అతిపెద్ద బ్యాంకుగా, ఇన్సూరెన్స్ బిజినెస్‌గా ఎదగాలని ప్రయత్నం చేశాయి. ఇరు గ్రూప్‌లు అక్టోబర్ 5ను డెడ్‌లైన్‌గా విధించుకున్నాయి. కానీ అప్పటికీ ఇరు గ్రూప్‌లు ఓ ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయాయి. స్టేక్ వాల్యుయేషన్ విషయంలో ఇరు కంపెనీలకు చెడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 2014లో బ్యాంకింగ్ లైసెన్సు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ బ్యాంకు అంత బలమైన డిపాజిట్ బేస్‌ను నిర్వహించలేకపోతుంది. ఇరు సంస్థలు విలీన చర్చలు ప్రారంభించే ముందు 'పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి'' అంటూ ఐడీఎఫ్‌సీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ లాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment